ఫ్లిప్ కార్ట్ లో శాంసంగ్ ఫోన్లపై భారీ తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ సేల్ లో భాగంగా గెలాక్సీ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది. నో చాష్త్ ఈఎంఐ పేమెంట్ ఆప్షన్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. అలాగే శాంసంగ్ కేర్ ప్లస్, యాక్సిడెంట్, లిక్విడ్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ప్లాన్లు కూడా అఫర్ చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్20 సిరీస్ ఫోన్లు హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసేవారికి రూ. 4000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. 12 నెలల నో కాస్ట్ ఈఎంఐ కూడా పొందొచ్చు. వీటితో పాటుగా రూ.2,499 విలువైన శాంసంగ్ కేర్ ప్లస్ ప్యాకేజ్ కూడా తీసుకోవచ్చు. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్10 లైట్ స్మార్ట్ ఫోన్ పై కూడా రూ.4,000 ఇన్ స్టెంట్ క్యాష్ బ్యాక్ లభిస్తుంది.
కానీ గెలాక్సీ ఎస్10 లైట్ ప్రీమియం 128 జీబీ వేరియంట్ పై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎస్10 లైట్ 512 జీబీ వేరియంట్ పై రూ. 2000 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. వీటితోపాటు శాంసంగ్ స్మార్ట్ వాచ్ లు, ఫిట్ నెస్ బ్యాండ్ లపైనా ఆఫర్లు ప్రకటించింది. శాంసంగ్ స్మార్ట్ వాచ్ లపై 10 శాతం ఇన్ స్టెంట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. జూన్ 9 నుంచి ప్రారంభం అయిన ఈ సేల్ 12 వ తేదీ వరకు మాత్రమే నడుస్తుంది.