లాక్ డౌన్ లో నిత్యావసరాల కొనుగోలు చేసేవారి కోసం ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే తాజా నెయ్యి, గోధుమ పిండి, బాదం పప్పు మొదలైనవి అందిస్తున్నారు. మీరు చదివింది నిజమే. ‘వీకెండ్ గ్రాసరీ ధమాకా’ పేరుతో ఫ్లిప్ కార్ట్ ఆన్ లైన్ షాపింగ్ ద్వారా ఒక్క రూపాయి ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారీ తగ్గింపు ధరలతో గోధుమ పిండి, నూనే, బాదం పప్పు ఇలా వివిధ రకాల సరుకులను అందిస్తున్నారు. ఒక్క రూపాయికే లభించే వస్తువుల్లో ముఖ్యంగా ఆనంద్ కంపెనీకి చెందిన 100 ml దేశి నెయ్యి, పిల్స్ బరీ గోధుమ పిండి, హ్యాపీల్లో బ్రాండ్ 100 గ్రాముల బాదాం పప్పు, రాజ్మా ఉన్నాయి. అదే విధంగా మసాలా దినుసులపై 25 శాతం, పప్పు దినుసులు, సుగంధ ద్రవ్యాలపై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. వీటితో పాటు ఆహార ధాన్యాలు, నూనెను 60% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.
ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికీ అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాప్ ద్వారా కొనుగోలు చేసిన వారికీ 100 రూపాయల తగ్గింపు ఇస్తుంది.