logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్: స్మార్ట్ ఫోన్ పై రూ. 30 వేల భారీ తగ్గింపు!

ఫ్లిప్‌కార్ట్ నుంచి మరో భారీ సేల్ ప్రారంభం కానుంది. జూన్ 23 నుంచి 27 మధ్య ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ సేవింగ్ డేస్ సేల్ ‘ పేరుతో భారీ సేల్ ను ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తుంది. మూడు నెలల తర్వాత ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన అతి పెద్ద సేల్ ఇదే కావడం విశేషం. గతేడాది సాంసంగ్ గెలాక్సీ ఏ80 పేరుతో మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

ప్రపంచంలోనే తొలి రొటేటింగ్ కెమెరా తో ఈ ఫోన్ రూపొందింది. కాగా ఇప్పుడు ఈ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ భారీ తగ్గింపును ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ. 52 వేలు. కాగా 4 వేల తగ్గింపుతో రూ.47,990 ధరతో ఈ స్మార్ట్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసారు. అయితే ధర మరీ ఎక్కువ కావడంతో ఫ్లిప్ కార్ట్ లో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.41,999.కు తగ్గించింది.

తాజాగా ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నేపథ్యంలో ఈ ఫోన్ పై ఏకంగా రూ. 20 వేల తగ్గింపు ప్రకటించింది. కేవలం రూ.21,999 ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటుగా హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ఉపయోగించి కొనుగోలు చేసేవారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్ కూడా లభించే అవకాశం ఉంది.

సాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్ ప్రత్యేక ఫీచర్లు:
క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
3700ఎంఏహెచ్ బ్యాటరీ
25వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
48, 8 మెగాపిక్సెల్+ 3డీ టైమ్ ఆఫ్ ఫ్లైట్ విత్ రొటేటింగ్ ఫెసిలిటీ కెమెరా
6.7 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే

Related News