ఫ్లిప్ కార్ట్ మరోసారి ఫ్లిప్ స్టార్ట్ డేస్ ను ప్రారంభిస్తుంది. ఈ సేల్ ను డిసెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు అందుబాటులో ఉంచనుంది. ఈ సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్ యాక్సెసరీలపై 80 శాతం, టీవీలు, ఏసీలు, రెఫ్రిజిరేటర్లపై 40 నుంచి 50 శాతం వరకు భారీ తగ్గింపును ప్రకటించింది.
వీటితో పాటుగా ఇతర వస్తులు, యాక్సెసరీలపై కూడా భారీగా తగ్గింపునిస్తుంది. స్మార్ట్ వాచ్లు రూ.1,299 నుంచి, స్మార్ట్ టీవీలు రూ.8,999 ప్రారంభ ధరగా ఉన్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగుల కోసం ల్యాప్ టాప్ లు, ఆఫీస్ ఛైర్లపై కూడా ఈ డీల్స్ ఉన్నాయి. వీటితో పాటుగా దుస్తులు, యాక్సెసరీలు, చెప్పులు, మొబైల్ ఫోన్లు, ఫర్నీచర్, హోమ్ డెకార్లపై కూడా ఫ్లిప్ కార్ట్ తగ్గింపునిస్తుంది.
ల్యాప్ టాప్ లపై 30 శాతం, హెడ్ ఫోన్స్, స్పీకర్లపై 70 శాతం డిస్కౌంట్లు ఉన్నాయి. అయితే ఈ డీల్స్ ను పొందడానికి ఫ్లిప్ కార్ట్ ల్యాండింగ్ పేజీని తెరిచింది. లింక్ ను క్లిక్ చేయడం ద్వారా ఈ సేల్ కు సంబందించిన ఆఫర్లు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు.