తిరుమల తిరుపతి దేవస్థానంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గోవిందరాజ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న టీటీడీ శానిటరీ ఇన్స్పెక్టర్ కు కరోనా లక్షణాలు కనిపించడంతో అయన పరీక్ష చేయించుకున్నారు. ఫలితాల్లో కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో గోవిందా రాజ స్వామి ఆలయాన్ని రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది.
టీటీడీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆలయ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు ఆలయాన్ని పూర్తిగా శానిటైజ్ చేయనున్నారు అధికారులు. ఆ తర్వాత యథావిథిగా దర్శనం కొనసాగుతుందన్నారు. అయితే సదరు కరోనా సోకినా ఉద్యోగి ఇటీవల పాత హుజుర్ ఆఫీస్, పిహెచ్ సస్టోర్ ను సందర్శించినట్టుగా అధికారులు గుర్తించారు. ఇప్పుడు వాటిని కూడా మూసివేసి శానిటైజ్ చేయనున్నట్టుగా తెలిపారు. కరోనా పాజిటివ్ వ్యక్తిని కలిసిన వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు.