logo

  BREAKING NEWS

ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |  

చనిపోయిందనుకున్న ఆమె తిరిగొచ్చింది.. కిమ్ మరో సంచలనం !

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేము. ఆయన తీసుకునే నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కిమ్ మాటకు ఎదురు చెబితే ఎంతటివారైనా కనుమరుగు అవ్వాల్సిందే. కిమ్ భార్య రి సోల్ జూ కూడా ఇలాగే అదృశ్యమయ్యారు. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు. ఏకంగా ఏడాది పాటుగా ఆమె కనిపించకుండాపోయారు.

కానీ ఆమెకు సంబందించిన ఎలాంటి విషయం బయటకు రాలేదు. కొంతమంది ఆమె చనిపోయింది అంటే మరికొందరేమో చంపేసి ఉంటారన్నారు. ఇలా రకరకాల ఊహాగానాలకు తాజాగా చెక్ పెట్టాడు కిమ్. తన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకలకు కిమ్ సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిమ్ భార్యాను చూసినవారంతా షాక్ కు గురయ్యారు. ఈ వేడుకల్లో కిమ్ పక్కన కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.

ప్రదర్శనలో పాల్గొన్నవారిని కిమ్ భార్య ప్రశంసించారు. సంవత్సరకాలం తర్వాత మొదటిసారి ఆమె ఈ వేడుకల్లో పాల్గొనడానికి బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా ఉత్తరకొరియాకు చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అధికారి ఒకరు రి సోల్ జూ క్షేమంగానే ఉన్నారని ఆమె తన పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నారని తెలిపారు. ఆయన ఈ విషయం తెలిపిన మరుసటి రోజే రి సోల్ జూ ఈ వేడుకల్లో దర్శనమివ్వడం విశేషం. కాగా కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జయంతిని ఉత్తర కొరియా జాతీయ సెలవు దినంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News