logo

  BREAKING NEWS

ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |   ప్రధాని మోదీ వేయించుకున్న వాక్సిన్ ఏదో తెలుసా?  |   శ‌భాష్‌ జ‌గ‌న్‌.. ఈ ఒక్క నిర్ణ‌యంతో మ‌రో మెట్టు ఎక్కేశావు  |   పెట్రోల్ పంపులో మ‌న‌కు ఇవ‌న్నీ ఉచితంగా ఇవ్వాల్సిందే  |   శుభ‌వార్త‌.. త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. 26-02-2021 బంగారం ధ‌ర‌లు  |   నితిన్ ‘చెక్’ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా ఫట్టా?  |   బ్రేకింగ్: ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా కేసులో యువతి ఆత్మహత్య!  |   కుప్పంలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ.. షాకివ్వనున్న కీలక నేతలు!  |  

వైఎస్ షర్మిల పార్టీలో తొలి నియామకం.. టీఆర్ఎస్ సీనియర్ నేతకు చోటు!

తెలంగాణాలో కొత్త పార్టీ ఏర్పాటు పై శరవేగంగా ముందుకు వెళ్తున్నారు వైఎస్ షర్మిల. వరుసగా వైఎస్ అభిమానులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి ముఖ్య నేతలను కలుసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు, మాజీ ఐఏఎస్, ఐపీఎస్ లు షర్మిలతో భేటీ అయిన విషయం తెలిసిందే.

తాజాగా కొత్త పార్టీకి సంబందించిన తొలి నియామకాన్ని చేపట్టారు షర్మిల. తన కార్యక్రమాల సమన్వయకర్తగా టీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతను అధికారికంగా నియమించుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత అయిన వాడుక రాజగోపాల్ ను తన కార్యక్రమాల సమన్వయ కర్తగా షర్మిల నియమించుకున్నారు. వాడుక రాజగోపాల్ కు వైఎస్ కుటుంబంతో 30 ఏండ్ల అనుబంధం ఉంది.

మరోవైపు ఆయన రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసారు. అనంతరం షర్మిలతో భేటీ అయ్యి ఆమెకు తన మద్దతును ప్రకటించారు. ఇదిలా ఉండగా మాజీ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఉదయ సింహాలు షర్మిల కొత్త పార్టీకి సలహాదారులుగా ఉందనున్న విషయం తెలిసిందే.

Related News