‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సాన తొలి విజయాన్ని నమోదు చేసుకున్నాడు. దర్శకుడు సుకుమార్ శిష్యుడిగా టాలీవుడ్ కి ఎనారైనా ఈ దర్శకుడు ఒక్క సినిమాతోనే తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతోనే మరో మెగా హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టికి కూడా మంచి గుర్తింపు లభించింది.
కానీ ఉప్పెన సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో కనిపించిన హీరోయిన్ కృతి కాదు. సినిమా ప్రారంభమయ్యేనాటికి సినిమా టీమ్ హీరోయిన్ ను మార్చేశారు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ కావడం, బేబమ్మ పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాను మిస్ చేసుకున్న ఆ మొదటి హీరోయిన్ పై పడింది. ఆమె ఎవరా అని సినిమా చూసిన వారంతా ఆరా తీస్తున్నారు.
తాజాగా దర్శకుడు బుచ్చిబాబు సాన ఈ విషయంపై స్పందించారు. మొదట బేబమ్మ పాత్రకు మనీషా రాజ్ అనే తెలుగు హీరోయిన్ ను అనుకున్నారు. మనీషా గతంలో సునీల్ హీరోగా వచ్చిన ‘టూ కంట్రీస్’ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వకపోవడంతో అంతగా గుర్తింపు దక్కలేదు.
ఒకసారి బుచ్చిబాబు కృతి ఫోటోలు చూసారు. అమ్మాయి చాలా బాగుంది. తన సినిమాలో హీరోయిన్ గా సరిగ్గా సెట్ అవుతుందని అనుకున్నారు. కానీ అప్పటికే హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్ ను మార్చడం ఎలా అని సందేహించారు. ఈ విషయంపై గురువు సుకుమార్ ను సలహా అడిగాడు. ఆయనకు కూడా కృతి చూడగానే నచ్చింది.
మనందరి కంటే సినిమానే ముఖ్యం సినిమా బాగా వస్తుంది అనుకుంటే ఏ నిర్ణయానికి వెనకాడకు అని సలహా ఇచ్చారు. దీంతో ఉప్పెన టీమ్ లో కృతి యాడ్ అయిపోయింది. ఆమె ఎలా నటిస్తుందో అనే అనుమానాలు ఉన్నా తర్వాత పాత్ర కోసం కృతి కష్టపడిన విధానం చూసి ఆ భయాలన్నీ తొలగిపోయాయని దర్శకుడు వివరించాడు.