logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

గుడ్ న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇక ఆ జిల్లా క‌రోనా ఫ్రీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టివ‌ర‌కు అన్ని జిల్లాల్లో క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా ఇప్పుడు ఒక జిల్లా పూర్తిగా క‌రోనా ఫ్రీగా మారిపోయింది. క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌కాశం జిల్లా యంత్రాంగం విజ‌య‌వంత‌మైంది. ఒక్క మ‌ర‌ణం కూడా లేకుండా క‌రోనా నుంచి జిల్లాలో క‌రోనా బాధితులంతా కోలుకున్నారు. ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌స్తుతం ఒక్క క‌రోనా యాక్టీవ్ కేసు కూడా లేదు. జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 63 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా అంద‌రూ కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

మార్చ్ 13న ప్ర‌కాశం జిల్లాలో మొద‌టి క‌రోనా పాజిటీవ్ కేసు న‌మోదైంది. మ‌ర్కజ్ ప్రార్థ‌న‌ల‌కు వెళ్లి వ‌చ్చిన వారితో జిల్లాలో కేసులు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. దీంతో ఏప్రిల్ మొద‌టి వారం వ‌ర‌కు 50కి పైగా కేసులు న‌మోద‌య్యాయి. ఒంగోలుతో పాటు చీరాల, కారంచేడు, కందుకూరు వంటి మున్సిపాలిటీల‌తో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ పాజిటీవ్ కేసులు న‌మోద‌య్యాయి. అయితే, క‌రోనా బాధితుల కాంటాక్ట్‌ల‌ను గుర్తించ‌డం, వారిని క్వారంటైన్‌కు త‌ర‌లించ‌డంలో జిల్లా అధికారులు విజ‌య‌వంత‌మయ్యారు.

దీంతో మొత్తం జిల్లాలో ఇప్ప‌టివ‌ర‌కు 63 క‌రోనా పాజిటీవ్ కేసులు న‌మోదు కాగా ఇప్పుడు అంద‌రూ పూర్తిగా కోలుకొని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో క‌రోనా కార‌ణంగా ఒక్క‌రు కూడా మ‌ర‌ణించ‌క‌పోవ‌డం మ‌రో మంచి విష‌యం. ఇక ప్ర‌కాశం త‌ర్వాత చిత్తూరు జిల్లా క‌రోనా ఫ్రీగా మారుతుంద‌ని అనుకున్నా కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివ‌చ్చిన వారు జిల్లాలో ఎక్కువ‌గా ఉండ‌టంతో మ‌ళ్లీ అక్క‌డ క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.

Related News