తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. బెంగుళూరు నుంచి తిరుపతికి వస్తున్న విమానం రేణుగుంట ఇంటర్నేషనల్ విమానాశ్రయంలోకి ఎంటరైంది. ఇక రన్ వే పై లాండ్ అవ్వడానికి కొద్దీ సెకండ్ల వ్యవధిలో అక్కడున్న ఫైర్ ఇంజిన్ వాహనం రన్ వేపై బోల్తా పడింది. ఈ ప్రమాదాన్ని గమనించిన అధికారులు వెంటనే ఇండిగో పైలట్లకు సమాచారాన్ని అందించారు. పైలట్లు అప్రమత్తమవ్వడంతో రన్ వేఫై లాండ్ అవ్వబోతున్న విమానాన్ని అతి కష్టం మీద మళ్ళీ గాల్లోకి లేపారు.
దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది . ఏమాత్రం ఆలస్యం అయినా విమానంలోని ప్రయాణికులు ప్రమాదంలో పడేవారు. అయితే అప్పటికప్పుడు రన్ వేపై ఫైర్ ఇంజన్ వాహనాన్ని తొలగించడం కష్టం కాబట్టి ఇండిగో విమానాన్ని తిరిగి బెంగుళూరుకు వెలసిందిగా సూచించారు అధికారులు. దీంతో బెంగుళూరు నుంచి తిరుపతి వచ్చిన విమానం రేణిగుంటలో లాండ్ అవ్వకుండానే వెనుదిరగా వలసి వచ్చింది. ఈ విషయం తెలిసిన ప్రయాణికులు భారీ ప్రమాదం నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు.