logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. మంటలో చిక్కుకున్న కార్మికులు!

సంగారెడ్డి జిల్లా బొల్లారం కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వింధ్యా ఆర్గానిక్ కంపెనీలో కార్మికులు విధుల్లో ఉన్న సమయంలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో కార్మికులంతా కకావికలమైపోయారు. పేలుడు ధాటికి బయటకు పరుగులు తీసే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుంది.

ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. కొంతమంది గాయాలతో పడి ఉన్న కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మరి కొందరు మంటల్లో చిక్కుకుని ఉన్నట్టుగా సమాచారం. ప్రస్తుతం అక్కడకు చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది కార్మికులను రక్షించే ప్రయత్నాలు చేషున్నారు. అయితే రియాక్టర్ పేలడం వల్ల ప్రమాదం సంభవించిందా? లేక యజమాన్యాల నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా అనే విషయం తేలాల్సి ఉంది. ఈ ప్రమాదంలో భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.

Related News