logo

  BREAKING NEWS

చింత‌గింజ‌ల‌తో మోకాళ్ల నొప్పుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం‌  |   పాత రూ. 100, రూ.10, రూ.5 కరెన్సీ నోట్లు ఇకపై చెల్లవా.. నిజమెంత?  |   మాజీ మంత్రి జానారెడ్డికి ఊహించని షాక్.. బీజేపీ ప్లాన్ లో భాగమేనా?  |   వీడని ఉత్కంఠ.. పంచాయతీ ఎన్నికలపై మరో ట్విస్ట్..!  |   బ్రేకింగ్: వికటించిన కరోనా టీకా.. ఆశా కార్యకర్త బ్రెయిన్ డెడ్!  |   నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |  

కరోనాకు మందు.. రామ్ దేవ్ బాబాపై కేసు నమోదు!

కరోనా వైరస్ కు మందు కనిపెట్టామని యోగా గురువు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆనాటి నుండి పతంజలి కరోనీల్ ఔషధం పై వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ ముందుకు సంబందించిన పూర్తి వివరాలను నిశితంగా పరిశీలించవలసి ఉన్న కారణంగా దీనికి ఆమోదం లభించలేదు. అయితే ఈ ముందుకు డ్రగ్ లైసెన్స్ తీసుకునే సమయంలో కరోనాకు ముందుగా కరోనీల్ ను ఎక్కడా ప్రస్తావించలేదని కేవలం దగ్గు, జ్వరం, వంటి లక్షణాలు నిరోధించి రోగ నిరోధక శక్తిని పెంపోందిస్తుందని మాత్రమే పేర్కొన్నారని అధికారులు వెల్లడించారు.

కాగా దీనిని కరోనాకు ఆయుర్వేద ఔషధంగా పతంజలి పేర్కొంటుంది. తాజాగా రామ్ దేవ్ బాబా తో సహా పతంజలికి చెందిన మరో ఐదుగురిపై రాజస్థాన్ లో సెక్షన్ 420 కింద చీటింగ్ కేసు నమోదైంది. కరోనాకు మందు పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా ఈ కేసులో రామ్ దేవ్ బాబా సహా పతంజలి ఆయుర్వేద ఎండీ ఆచార్య బాలకృష్ణ, శాస్త్రవేత్త అనురాగ్, నిమ్స్ చైర్మన్ బల్బీర్ సింగ్ తోమర్, నిమ్స్ డైరెక్టర్ అనురాగ్ తోమర్‌పై పోలీసులు కేసు నమోదు చేసారు.

అలాగే పతంజలి కరోనీల్ ఔషధం పై క్లినికల్ ట్రయల్స్ జరిపిన రాజస్థాన్ లోని ప్రైవేటు ఆసుపత్రికి కూడా రాజస్థాన్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. కరోనీల్ ఔషధాన్ని శాస్త్రీయంగా పరీక్షించేవరకు వాటికీ సంబందించిన ప్రకటనలు, ప్రచారాలు నిలిపివేయాలని కేంద్ర ఆయుష్ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

Related News