logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ఆర్థిక ఇబ్బందుల్లో ప్ర‌ధాని.. ఈ క‌ష్టాలు ఎవ‌రికీ రావేమో..!

ఆర్థిక ఇబ్బందులు పేద‌లకు వ‌స్తాయి. నిరుద్యోగులు ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ఏదైనా మంచి ఉద్యోగం ఉంటే ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. అటువంటిది ఒక దేశ ప్ర‌ధానికి అస‌లే ఈ స‌మ‌స్య‌లు ఉండవు. ఆర్థిక సంక్ష‌భంలో చిక్కుకున్న ఓ పేద ఆఫ్రికా దేశ ప్ర‌ధానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ, ప్ర‌పంచంలోని ధ‌నిక దేశాల్లో ఒక‌టైన బ్రిట‌న్ ప్ర‌ధానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయ‌ట‌. ఎంత‌లా అంటే ఆర్థిక ఇబ్బందులు తాళ‌లేక ప్ర‌ధాని ప‌ద‌విని వ‌దులుకోవాల‌ని అనుకునేంత‌లా ఆయ‌న‌కు క‌ష్టాలు ఉన్నాయంట‌.

బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌కు మంచి ప‌రిపాల‌నా ద‌క్షుడిగా పేరుంది. నిజాయితీగా, పార‌దర్శంగా పాల‌న చేస్తారు. ప్ర‌ధాని కాక‌ముందు ఆయ‌న జ‌ర్న‌లిస్టు. టెలీగ్రాఫ్ ప‌త్రిక‌లో ఆయ‌న కాల‌మిస్ట్‌గా ప‌ని చేసే వారు. ఆ స‌మ‌యంలో బోరిస్ జాన్సన్‌‌కు నెల‌కు 2 ల‌క్ష‌ల 75 వేల పౌండ్ల వేత‌నం వ‌చ్చేది. త‌న ప్ర‌సంగాల ద్వారా మ‌రో ల‌క్షా 60 వేల పౌండ్ల‌ను సంపాదించేవారు. ఆయ‌న రాజ‌కీయాల్లోనూ ఉండేవారు. పార్ల‌మెంటు స‌భ్యుడిగా, మేయ‌ర్‌గా ప‌ని చేశారు. ఈ వేత‌నం కూడా వ‌చ్చేది. అప్పుడు ఆయ‌న‌కు ఆర్థిక ఇబ్బందులు ఉండేవి కాదు.

గ‌త ఏడాదికాలంగా ఆయ‌న బ్రిట‌న్ ప్ర‌ధానిగా ప‌ని చేస్తున్నారు. ప్ర‌ధానిగా ఆయ‌న‌కు కొన్ని సౌక‌ర్యాలు, సెక్యూరిటీ, హాంగూ ఆర్భాటాలు అన్నీ ఉంటాయి. దీనికి తోడు వేతనంగా ఒక ల‌క్షా 60 వేల పౌండ్ల జీతం వ‌స్తుంది. నిజాయితీగా ప‌ని చేసే ఏ ప్ర‌జా ప్ర‌తినిధికి అయినా సౌక‌ర్యాలు మిన‌హాయిస్తే జీతం మాత్ర‌మే ఆదాయ‌వ‌న‌రుగా ఉంటుంది. అది మ‌న గ్రామ స‌ర్పంచ్ అయినా, బ్రిట‌న్ అయినా నిజాయితీగా ఉంటే ప్ర‌భుత్వం ఇచ్చే జీతంతోనే బ‌త‌కాలి. బోరిస్ జాన్స‌న్‌కు ఏ వ్యాపారాలూ లేవు. కాబ‌ట్టి, ప్ర‌ధానిగా త‌న‌కు వ‌చ్చే వేత‌నంతోనే ఆయ‌న కుటుంబం న‌డుస్తుంది.

అంత‌కుముందు ఆయ‌న‌కు వచ్చే వేత‌నానికి త‌గ్గ‌ట్లుగా ఖ‌ర్చులు ఉండేవి. ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న ఆదాయం సాగానికి ఎక్కువ‌గా ప‌డిపోయింద‌ట‌. పైగా బోరిస్ జాన్స‌న్‌కు ఇద్ద‌రు భార్య‌లు, ఆరుగురు పిల్ల‌లు. ఇందులో ఒక భార్య‌కు విడాకులు ఇచ్చారు. ఆమెకు ప్ర‌తీనెల భ‌ర‌ణం చెల్లించాల్సి ఉంటుంది. పిల్ల‌లు, కుటుంబ పోష‌ణ వంటి వాటికి ఖ‌ర్చులు ఉంటాయి. వీటన్నింటికీ బోరిస్ జాన్స‌న్‌కు వ‌చ్చే జీతం ఏ మాత్రం స‌రిపోవ‌డం లేద‌ట‌.

అందుకే, ఆయ‌న బ్రిట‌న్ ప్ర‌ధాని ప‌దవి నుంచి దిగిపోవాల‌ని భావిస్తున్నార‌ట‌. త‌న స్నేహితులు, బ్రిట‌న్ పార్ల‌మెంటు స‌భ్యుడు ఒక‌రు ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు ఆ దేశ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని, మ‌ళ్లీ పాత వృత్తిలోకి వెళ్లాల‌ని అనుకుంటున్నార‌నేది ఈ వార్త‌ల సారాంశం. ఒక ప్ర‌ధానికే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లుగుతోంది క‌దా.

Related News