వెండి తెరపై వెలిగిపోవాలని సినీ పరిశ్రమకు వచ్చే యువతులను తప్పుదోవ పట్టించి కొందరు వ్యభిచార కూపంలోకి దింపుతున్నారు. తాజాగా సినీ పరిశ్రమలో చిన్నాచితకా వేషాలు వేసుకునే యువతులకు మాయమాటలు చెప్పి వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పోలీసులు పక్కా సమాచారం ప్రకారం అరెస్టు చేసారు. కాగా ఈ కేసులో ఓ సినీ దర్శకుడి భార్య ప్రధాన నిందితురాలిగా ఉండటం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని విరుగం బాక్కంలోని ఓ రెసిడెన్షియల్ కాలనిలో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇంటి పై దాడి చేసారు. అయితే వ్యభిచారం గృహం నడుపుతున్న మహిళను ఓ సినీ దర్శకుడి భార్య గా గుర్తించారు. ఈ ఘటనలో ఓ సహాయనటిని ఆమెతో ఉన్న మరో విటుడిని పోలీసులు అరెస్టు చేసారు. బాధిత యువతిని మైలాపురంలోని స్త్రీ సంరక్షణ కేంద్రానికి తరలించారు.