logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

నిద్ర మాత్రలు ఇచ్చి కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం..

కన్న తండ్రే ఆమె పాలిట కర్కశుడయ్యాడు. జ్వరంతో బాధ పడుతున్న యువతికి మందులకు బదులు నిద్ర మాత్రలు ఇచ్చి ఆమె పై అత్యాచారానికి పాల్పడ్డాడు. సభ్య సమాజం తల దించుకునే ఈ అమానుష ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది. హరలూర్‌ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ నెల 23న రాత్రి 19 ఏళ్ల కూతురికి నిద్ర మాత్రలు ఇచ్చి అత్యాచారం చేసాడు.

మరుసటి రోజు తండ్రి తన పక్కనే నిద్రించడంతో తనపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయాన్ని గుర్తించిన యువతి సవతి తల్లికి చెప్పింది. ఈ విషయం తెలిసి కూడా ఆమె నోరు మెదపకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అనంతరం స్థానిక పోలీసులను ఆశ్రయించింది. తండ్రి అఘాయిత్యం పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె తండ్రిని అరెస్టు చేసారు. అయితే ఈ కేసులో సవతి తల్లి పాత్ర కూడా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Related News