logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

కొడుకు కోసం కూతురిని బలిచ్చిన కసాయి తండ్రి..

ఈరోజుల్లో మహిళలు అడుగుపెట్టని రంగం అంటూ లేదు. శాస్త్ర విజ్ఞాన పరంగా దేశం ఎంత ముందుకు వెళుతున్నా నేటి సమాజంలో ఆడ కూతుర్లకు వివక్ష తప్పడంలేదు. అభం శుభం తెలియని ఓ ఆరేళ్ళ చిన్నారి కన్న తండ్రి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. కొడుకు కోసం కూతురునే పొట్టనపెట్టుకున్న ఆ కసాయి తండ్రి ఇప్పుడు కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్‌దగ్గా జిల్లాలోని పెష్రార్‌కి చెందిన సుమన్ నెగాసియా (26) కు భార్య, ఆరేళ్ళ కుమార్తె ఉన్నారు. అయితే తనకు కొడుకు పుట్టాలన్న కోరికతో ఇటీవల ఓ మాంత్రికుడి దగ్గరకు వెళ్ళాడు. అతను నీకు కొడుకు పుట్టాలంటే నీ కూతుర్ని బలివ్వాలని చెప్పడంతో కొడుకు కోసం దారుణానికి తెగబడ్డాడు.

భార్య ఇంట్లో లేని సమయం చూసి కూతురిని గొంతుకోసి హతమార్చాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసారు. మూఢనమ్మకాల పేరుతో నిందితుడిని హత్యకు పురిగొల్పిన మాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.

Related News