logo

  BREAKING NEWS

చంద్ర‌బాబు స‌వాల్‌కు సై అంటున్న జ‌గ‌న్‌..? రెఫ‌రెండంకు సిద్ధం.?  |   టీడీపీ – వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య చిచ్చుపెట్టిన ఆష్టాచెమ్మా ఆట‌..!  |   తెలంగాణ‌లో మ‌రో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి క‌రోనా పాజిటీవ్‌  |   పంతం నెగ్గించుకున్న నిమ్మ‌గ‌డ్డ‌.. మ‌ళ్లీ కుర్చీలోకి..!  |   ఆవిరి పీలిస్తే క‌రోనా వైర‌స్ చ‌నిపోతుందా..? అస‌లు నిజం ఇది..!  |   బ్రేకింగ్: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్!  |   బోది ధ‌ర్ముడిని చంపేశారా..? మ‌రి సైనికుడికి క‌నిపించింది ఎవ‌రు..?  |   విశాఖ షిప్ యార్డు బాధితులకు భారీ సాయం ప్రకటించిన ప్రభుత్వం  |   రాజధానిపై ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు..!  |   బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్య‌వ‌ర్గాన్ని ప్ర‌క‌టించిన బండి సంజ‌య్‌  |  

ఫాస్ట్ ఛార్జర్ లను ఉపయోగించేవారికి అలర్ట్.. ప్రాణాలకే ముప్పు!

నేటి ఆధునిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ లేకుండా క్షణం గడవని పరిస్థితి. అన్నింటికీ ఫోన్ పైనే అతిగా ఆధారపడుతోన్న నేపథ్యంలో వాటి పై మరింత ఒత్తిడి పెరిగి బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఫోన్లను మరింత వేగవంతంగా ఛార్జ్ చేసుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్గాలను స్మార్ట్‌ఫోన్ యూజర్లు అన్వేషిస్తున్నారు. ఛార్జింగ్ పెట్టిన క్ష‌ణాల్లో ఫోన్ బ్యాటరీ ఫుల్లై పోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అంద‌రూ అదే ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఫోన్ ఛార్జింగ్ క్ష‌ణాల్లో నిండిపోవాల‌ని ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ల‌నే కొనుగోలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్లు మార్కెట్ ను ఊపేస్తున్నాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానం లేకపతే యూజర్లు ఆ స్మార్ట్ ఫోన్లలపై ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా ప్రయాణాలు చేసే వారికి, స్మార్ట్‌ఫోన్‌లను ఎక్కువగా వాడేవారికి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ అత్యవసరంగా మారిపోయింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజు మొత్తానికి సరిపడా ఛార్జింగ్ అందించే కెపాసిటీ ఉండటం మంచి విషయమే కానీ ఇప్పుడు ఈ ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల ప్రాణాలకే ముప్పు పొంచి ఉందంటున్నారు నిపుణులు. ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ల విష‌యంలో వినియోగ‌దారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

బ్యాడ్‌పవర్ జెడ్‌నెట్ అందించిన నివేదిక ప్రకారం.. బ్యాడ్‌పవర్ అని పిలువబడే ఒక లోపం కారణంగా కొన్ని ఫాస్ట్ ఛార్జర్‌లలో పేలుడు సంభవిస్తుంది. బ్యాడ్‌పవర్ ఫాస్ట్ ఛార్జర్‌ను పాడు చేయడమే కాదు, ఛార్జింగ్ ప్రాసెస్ కోసం వోల్టేజ్‌పై చిప్ ఫర్మ్‌వేర్‌తో పాటు ఛార్జింగ్ డివైస్ ను అనుసంధానించడంలో విఫలం అవుతుంది. ఈ ఫాస్ట్ ఛార్జర్‌లలో కొన్ని 20 వోల్ట్‌ల తో ఛార్జ్ చేయగలవు, కొన్ని డివైస్ లు 5 వోల్ట్‌లను మాత్రమే సురక్షితంగా సపోర్ట్ చేయగలవు. మీ డివైస్ సురక్షితంగా ఛార్జ్ చేయగలిగే వోల్టేజ్ కంటే ఎక్కువ వోల్టేజ్ ను ఓవర్‌లోడ్ చేయడం ద్వారా వాటిలో మంటలు చెలరేగే అవకాశం ఉంది.

అందుకే వేగం తగ్గించుకుని మొబైల్ ఫోన్లను సురక్షితంగా ఛార్జ్ చేయగలిగే వోల్టేజీనే ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛార్జర్ ఫర్మ్‌వేర్‌ను ధ్వంసం చేసేందుకు గాను పరిశోధకులు మొబైల్ ఫోన్‌గా ఉన్న ప్రత్యేక పరికరాన్ని వినియోగించారు. హానికరమైన ప్రోగ్రామ్‌లు, బ్యాడ్‌ పవర్ సోకిన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర ఉపకరణాలు.. ఛార్జర్‌ల ఫర్మ్‌వేర్‌ను అవి ధ్వంసం చేస్తున్నాయని తేల్చి చెప్పారు. అయితే పరికరాలు పేలిపోకుండా నిరోధించేందుకు తయారీదారులు తక్కువ వోల్టేజ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు తోడ్పడే డివైస్ లకు అదనపు ఫ్యూజ్‌లను జోడించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. యూజర్లు తమ ఫోన్ ఛార్జర్లు, పవర్ బ్యాంకులను ఇతర పరికరాల కోసం వినియోగించడం చాలా ప్రమాదమని అంటున్నారు.

Related News