‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నవీన్ పోలిశెట్టి ఇప్పుడు మరో కామెడీ ఎంటర్టైనర్ తో వినోదం పంచడానికి సిద్దమయ్యాడు. నవీన్ పోలిశెట్టి హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమా విడుదల కు సిద్దమవుతుంది. అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ను మరో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నాడు.
కాగా ఈ సినిమాలో యూట్యూబర్ గా గుర్తింపు పొందిన ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా పరిచయమవుతుంది. ఈ సినిమా ట్రైలర్ ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబైలో షూటింగ్ స్పాట్ లో ప్రభాస్ ను కలిశారు. తమ సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేయించారు.
సినిమా ట్రైలర్ ఆద్యంతము వినోదభరితంగా ఉందంటూ ప్రభాస్ సినిమా టీమ్ ను అభినందించాడు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న హీరోయిన్ ఫరియాను చూసి ప్రభాస్ ఖంగుతిన్నాడు. ఆమెను చూసి చూడగానే ఈమేంటి ఇంత హైట్ ఉంది? అంటూ షాకింగ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చాడు. నిజమైన హైటేనా లేక షూస్, హీల్స్ లాంటివేమన్నానా? అంటూ ఫన్నీ కామెంట్స్ చేసాడు. నిజంగానే ఆమె ప్రభాస్ పక్కన నిల్చుంటే ఇద్దరూ ఒకే హైట్ లో ఉండటం విశేషం. కాగా ‘చిట్టి నీ నవ్వుంటె..’ పాటతో ఒక్కసారిగా ఫన్ లోకి వచ్చిందీ ముంబై టాల్ బ్యూటీ. ఆమె నవ్వుతో యూత్ ను ఆకట్టుకుంటుంది. కాగా ఇప్పుడు ఫరియా హైట్ పై ప్రభాస్ కామెంట్స్ చేయడంతో ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చేసుకుంది.