logo

  BREAKING NEWS

తెలంగాణలోని నిరుద్యోగులకు మంత్రి కేటీఆర్ శుభవార్త!  |   అయోధ్య మసీదుపై ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!  |   మహారాష్ట్ర – కర్ణాటకకు మధ్య ఏమిటీ ‘బెల్గాం’ వివాదం?  |   తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక ? ఆ ఎమ్మెల్యే రాజీనామా ఖాయం..?  |   మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి చిరంజీవి..? త‌మ్ముడి వెంట అన్న..?  |   బైడెన్ సంచలన నిర్ణయం.. ప్రవాస భారతీయులకు భారీ ఊరట!  |   పీఆర్సీ నివేదిక లీక్: తెలంగాణ సర్కార్ సీరియస్..నిరాశలో ఉద్యోగులు!  |   బ్రేకింగ్: మళ్ళీ రాజకీయాల్లోకి మెగాస్టార్.. నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు!  |   ఎర్రకోట అల్లర్లు: పంజాబీ నటుడు దీప్ సిద్ధూ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!  |   అంబానీ సెకను ఆదాయం.. సామాన్యుడికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలుసా?  |  

రజనీకాంత్ కు అభిమానుల షాక్.. తిరుగుబాటుకు సిద్ధం!

రాజకీయాల్లోకి రావడం లేదంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ఈ వార్త విని రాజకీయవర్గాల్లో సంతోషం నెలకొన్నా.. రజని పొలిటికల్ పార్టీపై ఎన్నో ఏళ్లుగా ఆశలు పెట్టుకున్న ఆయన అభిమానులు మాత్రం ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో వారంతా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.

రజనీ రాజకీయాల్లోకి వచ్చి తీరాల్సిందేనని పట్టుబట్టారు. లేదంటే వారంతా నిరసనలు తెలిపేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయన అభిమానులు రజనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి ఆయన అభిమానులు తరలివస్తున్నారు. ఆయన ప్రకటన తమను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

రజని తన ప్రకటనను వెనక్కి తీసుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఇటీవల అనారోగ్యం భారిన పడిన రజని మూడు రోజుల పాటు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కుటుంబం, శ్రేయోభిలాషుల వినతి మేరకు అయన తాను రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించి షాకిచ్చారు.

Related News