‘మహానటి’ సినిమాతో కీర్తి సురేష్ ప్రతిభ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయి జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కీర్తి. ఇప్పుడు అనుష్క, నయనతార తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో దూసుకుపోతుంది. కాగా ఇటీవల కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తాను ఎంతగానో అభిమానించే నటుల్లో హాలీవుడ్ లో టామ్ క్రూజ్ ఒకరని తెలిపింది. అతనంటే పిచ్చి ఇష్టమట. అలాగే షారుఖ్ ఖాన్, దీపికా పడుకునే, అలియా భట్ ల నటన నచ్చుతుందని పేర్కొంది. సీనియర్ నటీమణుల్లో రమ్యకృష్ణ నటన, సిమ్రాన్ డాన్స్ కు తాను పెద్ద అభిమానినని తెలిపింది. అలాగే కోలీవుడ్ లో నయనతార డ్రెస్సింగ్ స్టైల్ తనకెంతో ఇష్టమని పేర్కొంది.
ఇప్పటి ప్రేమ లేఖలు రాశారా అని అడిగిన ప్రశ్నకు కీర్తి స్పందిస్తూ.. ఇప్పటి వరకు ఎలాంటి ప్రేమ లేఖలు రాలేదు. కానీ ఓ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఓ అభిమాని తనకు ఓ బహుమతి ఇచ్చాడని తెలిపింది. అందులో కీర్తి ఫోటోలను ఎంతో అందంగా పొందు పరిచిన ఆల్బమ్ ఉందట. దానితో పాటు ఓ లెటర్ కూడా ఉంది. అది తెరచి చూస్తే అందులో తనను ప్రేమిస్తున్నాని ఆ అభిమాని రాసాడట. ఇప్పటికీ ఆ ప్రేమ లేఖను తాను భద్రంగా దాచుకున్నానని తెలిపింది.