logo

  BREAKING NEWS

భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |   మాజీ మంత్రి అఖిల ప్రియ కేసులో కొత్త మలుపు!  |   నువ్వు దేవుడివి సామీ.. 1020 మంది చిన్నారుల‌కు ప్రాణాలు పోసిన మ‌హేష్  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల‌ను టెన్ష‌న్ పెడుతున్న త్రివిక్ర‌మ్‌  |   తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |  

ఈ కంపెనీలు అమ్మే తేనెను వాడుతున్నారా? అయితే వెంటనే చదవండి!

మీరు ప్రతి రోజూ తేనెను వాడుతున్నారా? అందుకోసం మార్కెట్లో ఉన్న ప్రముఖ కంపెనీల బ్రాండ్లను ఉపయోగిస్తున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవలసిందే. ఇన్నాళ్లుగా మీరు అత్యంత నమ్మకంతో వినియోగిస్తున్న బ్రాండ్లు మిమల్ని దారుణంగా మోసగిస్తున్నాయి. తేనె పేరుతో ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు చేస్తున్న మోసాన్ని ఓ సంస్థ గుర్తించింది. అందుకు సంబంధించి సంచలన నిజాలను బయటపట్టింది. ఇప్పుడు ఈ వార్త ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురి చేస్తుంది.

సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతి రోజు తేనెను వాడుతుంటారు. ప్రస్తుతం కరోనా కాలంలో ప్రజలంతా ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. గోరువెచ్చని నీటిలో కాసింత తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని అనుకుంటున్నారు. ఇది వాస్తవమే అయినా ప్రతి రోజు మీరు తాగే తేనె నిజమైనది కాకపోవచ్చు.

వివరాల్లోకి వెళితే.. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తేనెను అత్యధికంగా వినియోగించడం మొదలు పెట్టారు. దీంతో తేనె అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఉత్తర భారతంలో ఉన్న తేనెటీగల పెంపకం దారుల లాభాలు మాత్రం ఊహించని విధంగా తగ్గిపోయాయి. ఈ విషయం పై సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్ మెంట్ (సీఎస్ఈ) అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా సంచలన విషయాలను గుర్తించింది. మన దేశంలో పెద్ద బ్రాండ్లుగా పేరున్న 13 కంపెనీలకు సంబందించిన తేనె శాంపిళ్లను సేకరించి పరీక్షించింది.

అయితే వారు తెలిపిన రిపోర్టులో 3 కంపెనీలు మాత్రమే ప్రమాణాలను పాటిస్తున్నాయని 10 కంపెనీలు అమ్ముతున్న తేనె కల్తీమయమని షాకింగ్ నిజాలు వెల్లడించాయి. ఇప్పుడు ఈ రిపోర్టు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టిస్తుంది. అందుకు కారణం కల్తీకి పాల్పడుతున్న కంపెనీల్లో రాందేవ్ బాబాకు చెందిన పతంజలితో పాటుగా డాబర్, బైద్యనాథ్ జండూ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చాలా తెలివిగా తేనెలో చక్కెరను కలుపుతున్నట్టుగా పరిశోధనలో వెల్లడైంది. అందుకోసం చైనా నుంచి లిక్విడ్ షుగర్ ను తీసుకొచ్చి ఈ దారుణానికి పాల్పడుతున్నాయి. కరోనా కారణంగా చక్కెరను అధికంగా తీసుకోవడం ప్రమాదమని తెలిసిన విషయమే. దీంతో ప్రజలంతా చక్కెరకు బదులుగా తేనెను అధికంగా ఉపయోగిస్తున్నారు.

దీంతో కరోనా ముప్పు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. కానీ ఈ కంపెనీలన్నీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. అయితే సీఎస్ఈ రిపోర్టుపై స్పందించిన ఈ కంపెనీలు ఇవన్నీ అవాస్తవమని, భారతీయ మార్కెట్లో తమ సంస్థలను దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రగా చెప్తున్నారు. ఈ కంపెనీల వాదనలపై సీఎస్ ఈ డైరెక్టర్ జనరల్ సునీతా నరేన్ మాట్లాడుతూ.. తేనె పేరుతో ఈ కంపెనీలు చేస్తున్న మోసాన్ని అధునాతన కల్తీగా అభిప్రాయపడ్డారు. కాగా ఈ సంస్థ 2003.. 2006 సంవత్సరాలలో కూల్ డ్రింక్స్ పై జరిపిన దర్యాప్తులో కూడా ఇదే తరహా కల్తీని బయటపెట్టాయి. ఇప్పుడు ఈ కంపెనీలు చేస్తున్నది అంతకన్నా ఘోరమైనదిగా ఆమె పేర్కొన్నారు. ఈ సంస్థ జరిపిన పరీక్షల్లో సఫోలా, మారికో, మార్కె ఫెడ్ సోహ్నా, నేచర్ నెక్టా అనే కంపెనీలు మాత్రమే అర్హత సాధించాయి. వీరు ప్రమాణాలను పాటిస్తున్నట్టుగా వెల్లడైంది.

Related News