logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

పెళ్లి పేరుతో వ‌ల వేసి రూ.65 ల‌క్ష‌లు స్వాహా.. కుటుంబం మొత్తం ఇదే దందా

ఆ మ‌హిళ‌కు పెళ్లై 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఓ కుటుంబం ఉంది. భ‌ర్త‌, అత్తా ఉన్నారు. అంద‌మైన కుటుంబ‌మే. కానీ, కుటుంబం మొత్తం విలాసాల‌కు అల‌వాటు ప‌డింది. విలాసాల‌ను తీర్చుకునేందుకు మోసాల బాట ప‌ట్టింది. పెళ్లి పేరుతో వ‌ల విసిరి ఎన్ఆర్ఐల నుంచి డ‌బ్బులు దండుకుంటోంది. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో వెలుగులోకి వ‌చ్చింది.

రంగారెడ్డి జిల్లాకు మోకిల‌కు చెందిన శ్రీనివాస్‌, మాళ‌విక‌(44) భార్యాభ‌ర్త‌లు. వీరికి ప్ర‌ణ‌వ్‌(22) అనే కొడుకు ఉన్నాడు. శ్రీనివాస్ త‌ల్లి గ‌జ‌ల‌క్ష్మీ కూడా వీరితోనే నివ‌సిస్తోంది. విలాసాల‌కు ఈ కుటుంబం బానిసైంది. దీంతో డ‌బ్బుల కోసం మోసాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. పెళ్లి కోసం మ్యాట్రిమోని సైట్ల‌కు వ‌చ్చే ఎన్ఆర్ఐల‌కు వ‌ల వేయాల‌ని నిర్ణ‌యించారు. మాళ‌విక‌నే కీర్తిగా అంద‌మైన అమ్మాయిల ఫోటోలు పెడుతూ ఎన్ఆర్ఐల‌ను ప‌రిచ‌యం చేసుకోవ‌డం మొద‌లుపెట్టింది. ఇలా అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజ‌నీర్‌గా ప‌ని చేసే ఓ ఎన్ఆర్ఐని వ‌ల‌లో వేసుకుంది మాళ‌విక‌. త‌న‌కు తండ్రి లేడ‌ని, ఆస్తి విష‌యంంలో త‌ల్లికి, త‌న‌కు గొడ‌వ‌లు ఉన్నాయ‌ని న‌మ్మించింది.

కోట్ల రూపాయ‌ల‌ విలువైన ఆస్తులు త‌న తండ్రికి ఉన్నాయ‌ని, ఇవి త‌న పేరు మీద‌కు మార్చుకోవాల‌ని చెప్పింది. త‌ర్వాత పెళ్లి చేసుకొని సంతోషంగా ఉందామ‌ని న‌మ్మించింది. నిజ‌మేన‌ని న‌మ్మిన స‌ద‌రు ఎన్ఆర్ఐ వ‌ద్ద నుంచి ఆస్తి పేరు మార్చుకునేందుకు అని చెప్పి రూ.65 ల‌క్ష‌లు దండుకుంది. త‌ర్వాత ఆ మ‌హిళ తీరుపై అనుమానం క‌లిగిన ఎన్ఆర్ఐ జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా అస‌లు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే మాళ‌విక కుటుంబంపై ప‌లు కేసులు ఉన్నాయి. పోలీసులు మాళ‌విక, ఆమె కుమారుడు ప్ర‌ణ‌వ్‌ను అరెస్ట్ చేశారు. ఆమె భ‌ర్త శ్రీనివాస్‌, అత్త గ‌జ‌ల‌క్ష్మీ ప‌రారీలో ఉన్నారు.

Related News