మన ఖాతాల్లో నుంచి డబ్బులను కాజేయడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పథకంతో వస్తున్నారు. వివిధ మెసేజ్‌లను మనకు పంపించి లింక్ ఓపెన్ చేయగానే ఖాతాను హ్యాక్ చేసి డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు ఇలాంటి మెసేజ్‌లే వస్తున్నాయి. మీ ఖాతా బ్లాక్ అయ్యింది.. ఈ డాక్యుమెంట్లో మీ వివరాలు నమోదు చేసి మళ్లీ మీ ఖాతాను అప్డేట్ చేసుకోండి అంటూ మెసేజ్‌లు వస్తున్నాయి.
ఈ మెసేజ్‌లపై ఎస్బీఐ ఖాతాదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ విషయమై నిజానిజాలు కనుక్కున్న కేంద్ర సమాచార ప్రసార శాఖ ఫ్యాక్ట్ చెక్ బృందం ఈ మెసేజ్ ఫేక్ అని తేల్చింది. ఇలాంటి మెసేజ్‌లు, ఈ మెయిళ్లకు స్పందించి వివరాలను ఇవ్వొద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది. ఒకవేళ ఇలాంటి మెసేజ్‌లో మీకూ వస్తే report.phishing@sbi.co.in అనే మెయిల్ ఐడీకి ఫిర్యాదు చేయాలని సూచించింది.
A message in circulation claiming that your @TheOfficialSBI account has been blocked is #FAKE #PIBFactCheck
▶️ Do not respond to emails/SMS asking to share your personal or banking details.
▶️ If you receive any such message, report immediately at report.phishing@sbi.co.in pic.twitter.com/Y8sVlk95wH
— PIB Fact Check (@PIBFactCheck) May 18, 2022