logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

బిల్డింగ్ పై నుంచి పడిపోయిన హీరోయిన్ భర్త.. ఆసుపత్రికి తరలింపు!

మళయాళ స్టార్ హీరో, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త ఫాహద్ ఫాజిల్ బిల్డింగ్ పై నుంచి కిందపడ్డారు. ‘మలయన్ కుంజ్’ అనే సినిమా షూటింగ్ లో భాగంగా ఓ బిల్డింగ్ పై నుంచి దూకే సన్నివేశం చిత్రికరణ జరుగుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఫాహద్ భవనం పై నుంచి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన ముక్కు భాగానికి తీవ్ర గాయాలవ్వగా.. మరి కొన్ని చోట్ల కూడా గాయాలైనట్టుగా తెలుస్తుంది.

కాగా హుటాహుటిన ఫహద్ ను సినిమా టీమ్ ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం ఆయనకు చికిత్సను అందిస్తున్నారు. వైద్యులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కాగా ఈ వార్త తెలిసిన వెంటనే భార్య నజ్రియా ఆసుపత్రికి తరలి వచ్చారు. తమ హీరో త్వరగాకోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

ప్రస్తుతం మలయాళంలో అరడజనుకు పైగా సినిమాలతో బిజీగా ఉన్నారు ఫాహద్. బాల నటిగా సినీ ఎంట్రీ ఇచ్చిన నజ్రియా ఆ తర్వాత మళయాళంతో పాటుగా ఇతర భాషల్లోనూ నటిగా సత్తా చాటింది. తెలుగులో డబ్ అయిన తమిళ సినిమా ‘రాజారాణి’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. కాగా 2014 లో ఫాహద్ ను నజ్రియా ప్రేమ వివాహం చేసుకున్నారు.

Related News