logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

ఆరేళ్ళ చిన్నారి గొంతు కోసి చంపిన తల్లి ఫేస్ బుక్ ప్రియుడు

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తల్లి ఫేస్ బుక్ ప్రియుడే ఆ చిన్నారి పాలిట కాలయముడయ్యాడు. తనను దూరం పెట్టిందన్న కోపంతో ఓ యువకుడు ఆరేళ్ళ చిన్నారి గొంతు కోసి హత్య చేసాడు. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసుల కథనం ప్రకారం.. వీఆర్వో కళ్యాణ్, అనూషలకు ఆరేళ్ల కూతురు ఆద్య. సికింద్రాబాద్ కు చెందిన కరుణాకర్ అనే యువకుడితో అనూషకు మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కాగా అనూష ఇటీవల రమేష్ అనే మరో యువకుడితో చనువుగా ఉండటంతో కరుణాకర్ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఘట్కేసర్ ఇస్మాయిల్ ఖాన్ గూడలోని అనూష ఉంటున్న విహారి హోమ్స్ కు వెళ్ళాడు.

కరుణాకర్ రాకను గమనించిన అనూష అప్పటికే ఇంట్లో ఉన్న రమేష్ ను బాత్రూం లో దాచింది. రమేష్ ను బయటకు రావాలంటూ కరుణాకర్ బెదిరించాడు. బయటకు రాకుంటే అనూష కూతురిని చంపుతానన్నాడు. అప్పటికీ రమేష్ బయటకు రాకపోవడంతో ఆరేళ్ళ చిన్నారి ఆద్య గొంతుకోశాడు. చిన్నారి అరుపులతో బయటకు వచ్చిన రమేష్ పై కరుణాకర కత్తితో దాడి చేయగా అక్కడి నుండి పారిపోయాడు. అనంతరం అతను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆద్య తండ్రి కళ్యాణ్ కు సమాచారం ఇచ్చారు.

Related News