logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

ట్రంప్ కు షాకిచ్చిన జుకర్ బర్గ్ దంపతులు 

ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ , ఆయన సతీమణి ప్రిస్కిల్లా చాన్ అమెరికా అధ్యక్షుడిపై సంచలన వ్యాఖ్యలు చేసారు. నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్య, ట్రంప్ వైఖరిపై వారు స్పందిస్తూ.. అధ్యక్షుడు ట్రంప్ వైఖరి చాలా విచారకరమైనందని, అసహ్యకరమైందన్నారు. నల్ల జాతీయుడి మరణానికి నిరసన తెలుపుతున్న వారిని ఉద్దేశిస్తూ.. కాల్చిపారేస్తామంటూ ఫేస్‌బుక్ వేదికగా ట్రంప్ వివాదాస్పద పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ జాత్యంకార పోస్టును తొలగించాలంటూ స్వయంగా ఫేస్‌బుక్ ఉద్యోగులే మార్క్ కు ఎదురుతిరిగారు.

గతంలో ట్రంప్ పోస్ట్ పై స్పందిస్తూ.. అధక్షుడి మెసేజ్ లో ఎలాంటి రెచ్చగొట్టే విధమైన అంశాలు లేవని సమర్థించాడు మార్క్. అలాంటిది ఇప్పుడు మనసు మార్చుకుని ట్రంప్ పోస్టులపై ఘాటు విమర్శలు చేయడం గమనార్హం. చాన్ ఇనీషియేటివ్ కు నిధులు అందించిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారం, ద్వేషపూరిత పోస్ట్‌లను అరికట్టాలంటూ డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ పై వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

దింతో మార్క్ కూడా ఈ వ్యవహారంపై మరోసారి తన స్పందనను తెలియజేసాడు. జార్జ్ ఫ్లాయిడ్ మరణానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలో ట్రంప్ చేసిన బాధాకరమైన వ్యాఖ్యలు తమను బాధ కదిలించాయని పేర్కొన్నారు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ వీరు ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే ఫేస్‌బుక్, చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ రెండూ వేర్వేరు సంస్థలని తెలిపారు.

ట్రంప్ పోస్ట్ ను ఫేస్‌బుక్ నుంచి తొలగించకపోవడంపై తీవ్ర విమర్శలపాయిలయ్యాడు మార్క్. దీనిపై స్పందిస్తూ.. సైన్యాన్ని దింపుతామన్న ట్రంప్ వ్యాఖ్యలు ప్రజలకు తెలియజేసేందుకు పోస్ట్ ను తొలగించలేదన్నాడు. జార్జ్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమానికి మార్క్ దంపతులు మద్దతు తెలుపుతున్నట్టుగా ప్రకటన చేసారు.

Related News