logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోండి!

ముఖానికి ఆవిరి పట్టడం అనేది ఎప్పటి నుంచో అవలంబిస్తున్న ఒక బ్యూటీ పద్ధతి. దీనినే ఫిషియల్ స్టీమింగ్ అంటారు. ఆవిరి పట్టడం వలన చర్మానికి కలిగే మేలు చాలానే ఉంది. ఎన్నో రకాల కాస్మెటిక్స్ కూడా తీసుకురాలేని మెరుపును ఒక్కసారి ఆవిరి తీసుకోవడం వలన తీసుకురావచ్చు. కానీ సరిగా ఆవిరి తీసుకోవడం తెలియకపోతే అది చర్మానికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. అంతే కాదు దీని వలన ఎన్నో దుష్పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది అంటున్నారు కాస్మెటిక్ నిపుణులు.

ముఖానికి అప్పుడప్పుడు ఆవిరి తీసుకోవడం వలన చర్మం శుభ్రపడుతుంది. చర్మంలోని రంధ్రాలు తెరుచుకుని ముఖంపై ఉన్న మలినాలను బయటకు నెట్టివేయడంలో ఇది ఉపయోగపడుతుంది. మృతకణాలు తొలగిపోయి చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది. ముఖ్యంగా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముఖానికి మొటిమలు వాటి వలన ఏర్పడిన మచ్చలు తొలగించడానికి కూడా స్టీమింగ్ ను వాడవచ్చు.

ఫేస్ స్టీమింగ్ వలన వయసు కనిపించకుండా చేయవచ్చు,. వయసు పెరిగే కొద్ది శరీరం అనేక మార్పులను లోనవుతుందన్న విషయం తెలిసిందే. దాంతో ముఖం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి మార్పులు మానసికంగా మనలో ఒత్తిడిని పెంచుతాయి. అలాంటి సమయంలో ఫేస్ స్టీమింగ్ పద్దతిని ఉపయోగించవచ్చు. దాని వలన వయసు పైబడిన లక్షణాలను కనిపించకుండా చేయవచ్చు.

ముఖానికి ఆవిరి పట్టిన సమయంలో ముఖమంతా చెమట నీటితో నిండిపోతుంది. ఆ నీరే ముఖంలో ఉన్న మలినాలను తొలగిస్తుంది. హాట్ స్టీమింగ్ ఇచ్చినప్పుడు ముఖంలోని పోర్స్ ఓపెన్ అయ్యి అందులో ఉన్న దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి. ఇలా చేయడం వలన రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. అది ముఖంపై మెరుపును తీసుకువస్తుంది. స్టీమింగ్ అనేది చర్మానికి కాకుండా హెయిర్, బాడీలకు కూడా ఇవ్వచ్చు. ఆవిరి తీసుకున్న తర్వాత ముఖాన్ని గట్టిగా తుడవడం చేయద్దు. మెత్తని వస్త్రంతో మాత్రమే అద్దాలి. ఈ బ్యూటీ పద్ధతి అందాన్ని, ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తుంది. అయితే అతిగా స్టీమింగ్ తీసుకోవడం వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.

ఆవిరి తీసుకునే సమయ 5 నుంచి 10 నిముషాలు మాత్రమే ఉండేట్టుగా చూసుకోవాలి. ఎక్కువసేపు ఆవిరిపడితే అది కూడా ప్రమాదకరమే. వేడి నీటితో స్నానం చేస్తున్నప్పుడు శరీరానికి తాకే ఆవిరి లాంటి మోతాదులోనే ఆవిరి వేడి ఉండాలి. ముఖానికి మరీ దగ్గరగా వేడి నీటి ఆవిరి పట్టడం వలన చర్మంలో సహజసిద్ధంగా ఉండే నూనె స్రవించే గ్రంథులు పొడి బారి పోతాయి. ముఖం కమిలిపోతుంది. దీనివలన ముఖంపై ముడతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్టీమింగ్ తీసుకున్న తర్వాత ముఖాన్ని క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఒకవేళ ముఖం పొడి బారినట్టుగా అనిపిస్తే ఆవిరి తీసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ ను వాడాలి. మన చర్మ తత్వాన్ని బట్టి ఫిషీయల్, స్టీమింగ్ పద్దతులను ఎంచుకోవడం మంచిది.

 

 

Related News