logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

చిన్నారుల‌కు ఫేస్‌ మాస్క్‌.. చాలా రిస్క్

క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఫేస్ మాస్కులు మ‌న జీవితంలో భాగ‌మ‌వుతున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని త‌గ్గించ‌డానికి ఫేస్ మాస్క్ అనేది త‌ప్ప‌నిస‌రి అయ్యింది. భార‌త్‌తో పాటు చాలా దేశాలు మాస్క్‌ను త‌ప్ప‌నిస‌రి చేశాయి. ప్ర‌జ‌ల్లో బాగా అవ‌గాహ‌న రావ‌డంతో మాస్క్‌ను క‌చ్చితంగా ధ‌రిస్తున్నారు. అయితే, రెండేళ్ల లోపు చిన్నారుల‌కు మాస్క్ పెట్ట‌డం కొంత ప్ర‌మాద‌క‌ర‌మేన‌ని జ‌పాన్ పీడియాట్రిక్ అసోసియేష‌న్ అనే సంస్థ చెబుతోంది.

రెండేళ్ల లోపు చిన్నారుకు మాస్క్ పెట్ట‌డం ద్వారా వారు ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది అవుతుంద‌ని, దీంతో చిన్నారుల గుండెపై భారం పెరుగుతుంద‌ని స‌ద‌రు సంస్థ పేర్కొంది. వ‌డ‌దెబ్బ బారిన ప‌డే ప్ర‌మాదం కూడా ఉంటుంద‌ని చెబుతోంది. ఇక‌, అమెరికా సెంట‌ర్ ఫ‌ర్ డిసీస్ కంట్రోల్‌(సీడీసీ), అమెరిక‌న్ అకాడ‌మీ ఆఫ్ పీడియాట్రిక్స్ కూడా రెండేళ్ల లోపు చిన్నారుల ముఖాన్ని బ‌ట్ట‌తో క‌ప్ప‌డం మంచిది కాద‌ని చెప్పాయి.

Related News