logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం

ఆ యువ‌కుడి వ‌య‌స్సు 24. మ‌హిళ వ‌య‌స్సు 26. పైగా ఆమెకు పెళ్లైంది. యువ‌కుడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్ద‌రూ ఒకే ప్రాంతంలో నివ‌సిస్తారు. ఒకే చోట ఉద్యోగం చేస్తారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది. వ‌య‌స్సులో తేడా, పెళ్లైంద‌నే ఆలోచ‌న‌లు వ‌దేలిసి మ‌రీ ప్రేమించుకున్నారు. ఇది వివాహేత‌ర సంబంధంగా మారింది. చివ‌ర‌కు ఈ క‌థ విషాదంత‌మయ్యింది. ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

వివ‌రాల్లోకి వెళ్తే… రాజ‌న్న సిరిసిల్ల జిల్లా రాజీవ్‌న‌గ‌ర్‌కు చెందిన వెంక‌మ్మ‌, ద‌శ‌ర‌థం దంప‌తుల చిన్న కుమారుడు నామ వేణుగోపాల్‌, ఇదే ప్రాంతానికి చెందిన మ‌చ్చ పూజ ఒక క్లినిక్‌లో క‌లిసి ప‌ని చేసేవారు. మ‌హిళ‌కు నాలుగేళ్ల క్రిత‌మే త‌న మేన‌బావ అజ‌య్‌తో వివాహం జ‌రిగింది. కానీ, భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు ఉన్నాయి. ఇదే క్ర‌మంలో అవివాహితుడైన వేణుగోపాల్‌తో పూజ‌కు స్నేహం కుదిరింది.

ఈ స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో మ‌హిళ ఇంట్లో గొడ‌వ‌లు మ‌రింత పెరిగాయి. ఈ క్ర‌మంలో ఆమె ఈ నెల 15న ఇంటి నుంచి ఉద్యోగానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యం తెలిసి తీవ్ర మ‌న‌స్తాపం చెందిన‌ పూజ‌, వేణుగోపాల్ సిద్దిపేట జిల్లా జ‌గ‌దేవ్‌పూర్ మండ‌లంలోని పీర్ల‌ప‌ల్లి స‌మీప అట‌వీ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరేసుకొని మ‌ర‌ణించారు. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు మ‌రింత విచార‌ణ జ‌రుపుతున్నారు.

Related News
%d bloggers like this: