logo

  BREAKING NEWS

వ్యాక్సిన్ అంద‌రూ తీసుకోవాలా ? క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారూ తీసుకోవాలా ?  |   గుర‌క పెడుతున్నారా..? ఈ చిట్కా పాటిస్తే జీవితంలో గుర‌క పెట్ట‌రు  |   వ‌కీల్ సాబ్ మ‌రో రికార్డు.. షూటింగ్ కాక‌ముందే రూ.15 కోట్లు వ‌చ్చేశాయి  |   తెలంగాణ కొత్త‌గా ఆరు ఎయిర్‌పోర్టులు.. ఎక్కడెక్క‌‌డో తెలుసా ?  |   ‘మా సినిమా డైలాగులే కాపీ కొడతారా?’.. దేవినేనికి కొడాలినాని కౌంటర్  |   ముఖ్య‌మంత్రి మార్పు ఉండొచ్చు.. ఈటెల సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు  |   భూమా అఖిలప్రియ అరెస్టుపై కొడాలినాని సంచలన వ్యాఖ్యలు!  |   సీఎం జగన్ ఆకస్మిక ఢిల్లీ పర్యటన.. మతలబేంటి?  |   ”జీవితకాలం శిక్షపడే కేసులు స్వీకరించం”.. అఖిలప్రియకు కోర్టు భారీ షాక్!  |   బ్రేకింగ్: కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే రోజా..!  |  

ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం.. ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం!

జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన తరువాత ఎగ్జిట్ పోల్స్ పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. పోలింగ్ నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఓల్డ్ మలక్ పేట 26 ఆ డివిజన్లో బ్యాలెట్ పేపర్ పై అభ్యర్థి గుర్తులు తారుమారయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్ ను రద్దు చేస్తూ ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది.

ఓల్డ్ మలక్ పేటలోని 69 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి ఎల్లుండి 3వ తేదీన రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ… ఈసారి ఎలాంటి ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ప్రకటించకూడదని ఆదేశాలు జారీ చేసారు. కొన్ని చోట్ల రీ పోలింగ్ నిర్వహించాల్సి వస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా పేర్కొన్నారు. డిసెంబర్ 3వ తేదీ సాయంతం పోలింగ్ ముగిసే వరకు ఈ ఆదేశాలు అమలులో ఉండనున్నాయి.

 

Related News