logo

  BREAKING NEWS

నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల కౌంటర్: వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!  |   అమెరికా అధ్యక్షుడి ప్రసంగాల వెనుక మన తెలుగోడి ప్రతిభ  |   ‘పంచాయతీ’ నోటిఫికేషన్ ఎఫెక్ట్: షాకిస్తున్న అధికారులు!  |   ముగిసిన 5 గంటల డెడ్ లైన్.. ఎస్ఈసీకి అధికారుల షాక్!  |   కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడికి ముహూర్తం ఫిక్స్.. కీలక ప్రకటన!  |   అయోధ్య రామ‌మందిరానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం  |    గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం తెలుస్తారో?  |   చికెన్‌, కోడిగుడ్లు ఇలా తింటే డేంజ‌ర్‌.. fssai జాగ్ర‌త్త‌లు  |   తిరుపతి ఉపఎన్నిక పోరులో జనసేన అభ్యర్థి.. పవన్ క్లారిటీ!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇక వారికి 10 శాతం రిజ‌ర్వేష‌న్లు  |  

అచ్చెన్నాయుడు అరెస్ట్.. ఈఎస్ఐ స్కామ్ లో మరో మాజీ మంత్రి హస్తం?

టీడీపీ మాజీ మంత్రి, టెక్కలి నియోజక వర్గం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును పోలీసులు అరెస్టు చేసారు. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో 100 మంది పోలీసులు అచ్చెన్నాయుడును ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ మందుల కుంభకోణంలో భారీగా అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అచ్చెన్నాయుడు అరెస్టుతో టెక్కలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

గత ప్రభుత్వాల హయాంలో అచ్చెన్నాయుడుడు మంత్రిగా ఉన్న సమయంలో రూ.988 కోట్ల కొనుగోళ్లు జరిగాయని, అందులో రూ.150 కోట్ల భాటీ అవినీతి జరిగిందని సీబీఐ గుర్తించింది. అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకే నామినేషన్ పద్దతిలో కొనుగోళ్లు జరిగాయని ఆరోపణలు వచ్చాయి..ఈ కేసుపై ఏసీబీ రంగంలోకి దిగడంతో దర్యాప్తు మరింత వేగంగా జరిపించారు.

తాజాగా ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబి అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఈఎస్ఐ కుంభకోణంలో మొత్తం రూ. 150 కోట్లకు పైగా అవినీతి వెలుగు చూసింది. ఈ కేసులో ఈఎస్‌ఐ రవికుమార్, రమేష్, విజయను బాధ్యులుగా గుర్తించారు. ఈ కేసులో మరో మాజీ మంత్రి హస్తం కూడా ఉందని ఆయనకు కూడా నోటీసులు జారీ చెరసారని తెలుస్తుంది. త్వరలోనే ఆ మాజీ మంత్రిని కూడా అధికారులు అరెస్టు చేయనున్నారని సమాచారం.

Related News