ఈరోజు దేశవ్యాప్తంగా వాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంబమైన్ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రజల్లో వాక్సిన్ పట్ల ఎన్నో భయాలు, అపోహలు నెలకొన్నాయి. దీంతో తెలంగాణలో ప్రజలకు కరోనా వాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు రాష్ట్రంలో తొలి కరోనా వాక్సిన్ ను తానే వేయించుకుంటానని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కానీ తొలి వాక్సిన్ ను గాంధీ ఆసుపత్రి పారిశుధ్య కార్మికురాలు కర్మ చారి కృష్ణమ్మకు వేయించారు. దీనిపై ఈటెల రాజేందర్ స్పందించారు. తాను తొలి టీకా తీసుకోకపోవటానికి గల కారణాలను ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకే తాను తొలి వాక్సిన్ కు దూరంగా ఉన్నానన్నారు.
కరోనా పై వేలాది మంది వైద్య, పారిశుధ్య సిబ్బంది ముందుండి పోరాటం చేశారన్నారు. ఈ క్రమంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసారని ప్రధాని కంట తడి పెట్టుకున్నారు. అయితే తొలి టీకాను వారికే అందించాలని ప్రధాని సూచించారని ఆయన సూచనల మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు.