తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి షెడ్యూలు విడుదల చేసింది. షెడ్యూలు ప్రకారం.. జులై 5 నుంచి 9 వరకు తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 20 న పీజీఈసెట్, జులై 1న ఈసెట్ నిర్వహించనున్నట్టుగా విద్యామండలి ప్రకటించింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో త్వరలోన్ టీఎస్ఎడ్ సెట్, ఐసెట్, పీజిలాసెట్, టీఎస్ పీఈసెట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందుకు సంబందించిన షెడ్యూలు నిర్ణయించాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ప్రస్తుతానికి ముఖ్యమైన ప్రవేశ పరీక్షల షెడ్యూలు ను మాత్రమే ప్రకటించింది.