ఖమ్మం జిల్లాలో జింక్షన్ వికటించి ఓ బీటెక్ విద్యార్థిని మరణించింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అనాసాగరం గ్రామానికి చెందిన పంబ లక్ష్మీదుర్గ(23) బీటెక్ చదువుతోంది. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను ఖమ్మం నగరంలోని ఆరోగ్య హాస్పిటల్లో చేర్పించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే ఆమె మరణించింది. వైద్యులు ఇచ్చిన హైడోస్ ఇంజక్షన్ వికటించే ఆమె మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యం ఆమె మరణానికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. లక్ష్మీదుర్గను వేరే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.