logo

  BREAKING NEWS

మీ పిల్ల‌ల‌కు బండిస్తున్నారా ? జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి  |   ఆరియానా గ్లోరీకి బంప‌ర్ ఆఫ‌ర్‌.. మెగా హీరో సినిమాలో ల‌క్కీ ఛాన్స్  |   ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆ నోటిఫికేషన్ రద్దు!  |   బ్రేకింగ్: తాజ్ మహల్ కు బాంబు బెదిరింపు..!  |   మున్సిప‌ల్ ఎన్నిక‌లపై సీక్రెట్ స‌ర్వే.. రిజ‌ల్ట్ చూసి షాకైన జ‌గ‌న్‌  |   బంగారం కొనేవారికి బ్యాడ్‌ న్యూస్.. పెరిగిన బంగారం ధ‌ర‌లు  |   బ్రేకింగ్: నిమ్మగడ్డ వివాదాస్పద నిర్ణయానికి హైకోర్టు బ్రేకులు.. భారీ ఎదురుదెబ్బ!  |   ఆనాడు జగన్ ను అడ్డుకున్నారు.. బాబుపై ఏపీ మంత్రి ధ్వజం  |   మంత్రి కేటీఆర్ కు సవాల్.. ఓయూ క్యాంపస్ దగ్గర ఉద్రిక్తత!  |   హైటెన్షన్: చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు.. ఎయిర్పోర్టులో బైఠాయింపు!  |  

పంచాయతీ ఎన్నికలు: నిమ్మగడ్డకు ఉద్యోగ సంఘాల షాక్!

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొనలేమంటూ ఉద్యోగ సంఘాలు ఎస్ఈసీ కి షాకిచ్చాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించాయి. ఎన్నికల పై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్టుగా వారు వెల్లడించారు.

రాష్ట్రంలో వాక్సిన్ పంపిణీ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో ఎన్నికల విధులు నిర్వహించడం ఎలా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఎన్నికలు నిర్వహించిన పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికమయ్యాయని అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల విధుల్లో పాల్గొని తమ ప్రాణాలను పణంగా పెట్టలేమని ఆవేదన వ్యక్తం చేసారు. వాక్సిన్ ప్రక్రియ పూర్తయే వరకు విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం రోజున ఈ అంశంపై సుప్రీంలో పిటిషన్ వేయనున్నామని వెల్లడించారు.

Related News