logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కొనడానికి ఇదే మంచి సమయం.. ఏప్రిల్ నుంచి షాకివ్వనున్న ధరలు!

మీరు టీవీ, ఏసీ, కూలర్, ఫ్యాన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఆ నిర్ణయాన్ని వాయిదా వేయకపోవడమే మంచిది. టీవీలు కొనుగోలు చేసేవారికి ఇదే మంచి సమయం. ఎందుకంటే వచ్చే ఏప్రిల్ నెల నుంచి టీవీల ధరలు విపరీతంగా పెరగనున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెల్స్ ధరలు ఏకంగా 35 శాతం పెరిగాయి.

దీంతో ఆ భారం స్మార్ట్ టీవీ తయారీదారు కంపెనీలపై పడుతుంది. అందువల్ల ప్రముఖ టీవీ బ్రాండ్లయిన పానాసోనిక్, హయర్, థామ్సన్ లాంటి బ్రాండ్లన్నీ టీవీ ధరలను పెంచాలనే నిర్ణయానికి వచ్చాయి. ఇప్పటికే ఓపెన్ సెల్ ధరలు పెరగడంతో ఎల్జీ కంపెనీ కూడా టీవీల ధరలు పెంచేసింది. టీవీల తయారీలో ఓపెన్ సెల్ ప్యానెళ్లది చాలా కీలక పాత్ర. యూనిట్ లో 60 శాతాన్ని ఇవి కవర్ చేస్తాయి.

ఈ ప్యానెళ్లను ఓపెన్ సెల్ స్థితిలో ఆయా కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. వీటి ధరలు పెరగడంతో ఆ భారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నాయి టీవీ కంపెనీలు. ఈ నేపథ్యంలో టీవీలపై ఏప్రిల్ నుంచి రూ. 2 నుంచి 3 వేల వరకు పెరగవచ్చు. అయితే మన దేశంలో ప్రస్తుతం 32 ఇంచుల టీవీలకు భారీగా డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే.

మార్కెట్ అంచనాల మేరకు స్మార్ట్ టీవీలపై 5 నుంచి 7 శాతం ధరలు పెరగవచ్చు. అంటే ఒక్కో ఎల్ ఈడీ టీవీ పై రూ. 5 నుంచి 6 వేల వరకు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే సమయంలో ఏసీల ధరలు కూడా సామాన్యులకు షాకివ్వనున్నాయి. పాలీమర్స్, కాపర్, స్టీల్, ప్యాకేజింగ్ మెటీరియల్స్ ధరలు పెరగడంతో ఆయా కంపెనీలు కూడా ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి.

ఈ నేపథ్యంలో ఏసీలతో పాటుగా కూలర్, ఫ్యాన్, ఫ్రిడ్జిల ధరలు కూడా పెరగనున్నాయి. ఈ ఎలెక్ట్రానిక్ పరికరాలపై సుమారు 4 నుంచి 6 శాతం ధరలు పెరగవచ్చని మార్కెట్ అంచనా. అంటే ఏసీ ధరపై రానున్న రోజుల్లో రూ. 2000 వేలు పెరగవచ్చు. అందుకే టీవీ, ఏసీ కూలర్ల లాంటి పరికరాలను కొనుగోలు చేసేవారు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకోకుండా ఇప్పుడే కొనేయడం మంచిది.

Related News