ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఎస్ఈసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా సిసి కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ తో పాటుగా వీడియో గ్రఫీ కూడా రికార్డు చేయాలని ఆదేశాలు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
కౌంటింగ్ నిర్వహించే పలు సున్నిత, అతి సున్నిత, సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ విధంగా వీడియో గ్రఫీ రికార్డు చేయాలని ఆదేశాలలో పేర్కొంది. హై కోర్టు ఆదేశాల మేరకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టుగా పేర్కొన్నారు. అలాగే కరెంటు అంతరాయం ఏర్పడకుండా జెనరేటర్లు, ఇన్వెర్టర్లను ఏర్పాటు చేయాలని తెలిపింది.
ఎన్నికలకు సంబంధం లేని వ్యక్తులను కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించ వద్దని, ఫలితాల లీకుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ ఏర్పాట్లన్నీ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి అని నిమ్మగడ్డ పేర్కొన్నారు.