logo

  BREAKING NEWS

రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |   ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’గా ర‌వితేజ‌.. కథ వింటే విజిల్స్‌  |   ఒక‌సారి క‌రోనా వ‌చ్చిన వారు వ్యాక్సిన్ వేసుకోక‌పోతే ఏమ‌వుతుంది ?  |   మ‌న ‘గోల్డ్’ నీర‌జ్‌కు ఎన్ని డ‌బ్బులు వ‌చ్చాయో తెలుసా ?  |  

ప్రియురాలిని ముక్కలుగా చేసి హత్య.. చేతిపై టాటూ పట్టించింది

సహజీవనం చేసిన ప్రియురాలిని అత్యంత కర్కశంగా హత్య చేసిన నిందితుడిని సంవత్సరం తర్వాత మృతురాలి చేతిపై ఉన్న టాటూ పట్టించింది. పంజాబ్ లుథియానాకు చెందిన ఏక్తా జస్వాల్(19) గతేడాది జూన్ లో తల చేతులు వేరు చేసి దారుణంగా హత్య చేయబడింది. శరీర భాగాలు నరికివేయడంతో హత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు ఆమె ప్రియుడే హంతకుడని తేల్చారు.

వివరాల్లోకి వెళితే.. నిందితుడు షాకిబ్ అదే ప్రాంతానికి చెందిన యువతిపై కన్నేశాడు. అమన్ గా పేరు మార్చుకుని ప్రేమిస్తున్నానని ఆమె వెంట పాడేవాడు. చివరకు యువతీ కూడా అతని ప్రేమను అంగీకరించింది. వారిద్దరూ ఇంటి నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో యువతి ఇంటి నుండి 25 లక్షల నగదు తీసుకుని షకీబ్ తో మీరట్ వెళ్ళిపోయింది. వీరిద్దరూ కలిసి కొంతకాలం ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కలసి ఉన్నారు.

ఈ క్రమంలో ఓ రోజు ఆ యువతికి షాకిబ్ హిందువు కాదని, అమన్ గా పేరు మార్చుకుని తనను మోసం చేసాడని తెలుసుకుంది. ప్రియుడి మోసాన్ని తట్టుకోలేకపోయిన యువతి షాకిబ్ ను నిలదీసింది. తాను తెచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని, తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోతానని చెప్పడంతో డబ్బు పోతుందనే భయం తో ఓ రోజు మత్తు మంది కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి యువతి గొంతు నులిమి హత్య చేసాడు షాకిబ్. అనంతరం ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ఆనవాళ్లు లేకుండా చేసి పారిపోయాడు. యువతి ఒంటిపై ఉన్న పచ్చబొట్టు ఇతర వివరాలతో సంవత్సరం పాటు శ్రమించి ఎట్టకేలకు నిందితుడిని గుర్తించారు పోలీసులు.

తమ కూతురు హత్య చేయబడిందన్న వార్త తెలిసిన యువతి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. నిందితుడిపై దాడి చేసారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుంటుండగా పోలీసుల వద్ద రివాల్వర్ లాక్కుని పారిపోయే ప్రయత్నం చేసాడు. దీంతో పోలీసులు నిందితుడిని కాలిపై కాల్చి పట్టుకున్నారు.

Related News