logo

  BREAKING NEWS

తొలి టీకా పై వెనక్కి తగ్గిన ఈటెల.. కారణం ఇదే!  |   తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్ర మంత్రి లేఖ.. కీలక ఆదేశాలు!  |   వాక్సిన్ వికటించి 23 మంది మృతి.. మరో 23 మందికి అస్వస్థత!  |   వాక్సిన్ తీసుకున్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి: కేంద్రం కీలక వ్యాఖ్యలు!  |   ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |  

దయచేసి మమ్మల్ని మా పని చేసుకోనివ్వండి: ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులను మంత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశం ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలపై వస్తున్న విమర్శలపై అయన స్పందించారు. వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది కరోనా బారిన పడటానికి కారణం ప్రభుత్వం సదుపాయాల లేమి అంటూ వస్తున్న ఆరోపణలను ఖండించారు. రాష్ట్రంలో 10 లక్షల పీపీఈ కిట్లు ఉన్నాయని, మాస్కుల కొరత లేదని తెలిపారు.

నిమ్స్ ఆసుపత్రిలో కరోనా సోకినా వైద్యులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని అయన తెలిపారు. వైరస్ లక్షణాలు ఉన్న వారికీ, వృద్దులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికే పరీక్షలు నిర్వహించాలన్న ఐసీఎమ్ఆర్ సూచనల మేరకే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

ప్రతిపక్షాలు పని గట్టుకుని ప్రభుత్వాన్ని తమ పనిచేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. సామజిక మాధ్యమాల్లో తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఈటెల ఖండించారు. ప్రపంచం మొత్తం ఎదుర్కుంటున్న సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు. వారికో న్యాయం మాకో న్యాయం అన్నట్టుగా వ్యవహరించడం సరికాదన్నారు.

రాష్ట్రంలో కేంద్రం విధించిన లాక్ డౌన్ ను పాటిస్తున్నామని, ఐసీఎమ్ఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసారు. అయినా కొందరు తమపై పిటిషన్లు వేస్తూ అడ్డుపడుతున్నారన్నారు. ప్రజల పట్ల నిజమైన ప్రేమ ఉంటె ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అంతేగాని ఇలాంటి చప్పుడు చర్యలు మంచివి కాదని హితవు పలికారు.

Related News