logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

ఆ మరణాలన్నీ కరోనా చావులు కావు.. ప్రైవేటుకు వెళ్ళకండి: ఈటెల

తెలంగాణ రాష్ట్రంలో సాధారణంగా రోజుకు వెయ్యి మంది మరణిస్తుంటారు. అవన్నీ కరోనా మరణాలు కావని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసుల విషయంలో వస్తున్న ఆరోపణలపై ఈటెల స్పందించారు. కరోనా కేసులను దాచాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా ఆకట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వరంగల్ జిల్లాలో మూడు రోజులుగా అతధిక కరోనా ఆకేసులు నమోదవుతున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి ఈటల రాజేందర్ సి.ఎస్.ఆర్ గార్డెన్స్‌లో సమీక్ష నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి తర్వాత అతి పెద్ద ఆసుపత్రి వరంగల్ ఎంజీఎం అని ఈటెల అన్నారు. కరోనా రోగులు హైదరాబాద్ కు రావలసిన అవసరం లేదని ఎంజీఎంలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.

కరోనా ర్యాపిడ్ టెస్టుల ద్వారా 30 నిమిషాల్లో ఫలితాలను వెల్లడించగలుగుతున్నామన్నారు. కరోనాతో మృతి చెందిన రోగులను కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం చేసినా మున్సిపల్ సిబ్బందితో ప్రభుత్వమే అంత్యక్రియలు జరిపిస్తుందన్నారు. రాష్ట్రంలో 81 శాతం మంది కరోనా లక్షణాలు లేకుండానే రికవరీ అవుతున్నారన్నారు. ప్రజలెవరూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నామన్నారు.

ప్రజలు అనవసరపు ఆందోళనకు గురి కావద్దని అన్నారు. వైరస్ ను సకాలంలో గుర్తించని సమయంలోనే ప్రమాదాలు ఎదురవుతున్నాయన్నారు. ఇది మన రాష్ట్రం సమస్య కాదని మానవాళి మొత్తం కరోనాతో పోరాటం చేస్తుందన్నారు. ఇలాంటి మహమ్మారులను తట్టుకుని నిలబడే సత్తా మనకు ఉందని అది పూర్వం నుంచీ కొనసాగుతుందన్నారు. కానీ లక్షణాలు ఉన్నవారు మాత్రం కచ్చితంగా చికిత్స తీసుకోవాలని ఈటెల సూచించారు.

Related News