logo

  BREAKING NEWS

బ‌జాజ్ చేత‌క్ మ‌ళ్లీ వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు  |   హ‌మ్మ‌య్య‌… ఆ వ్యాక్సిన్‌లు కూడా వ‌చ్చేస్తున్నాయి  |   మీ ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయ్యిందా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? ఇలా తెలుసుకోండి  |   తగ్గిన బంగారం ధరలు 14.04. 2021 నాటి బంగారం, వెండి ధరలు  |   మళ్ళీ పెరిగిన బంగారం ధరలు 13.04.2021 నాటి బంగారం, వెండి ధరలు  |   శుభవార్త: భారత్ లో మరో వాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్!  |   కరోనా సెకండ్ వేవ్: ఎక్కువ మందిలో బయటపడుతున్న లక్షణం ఇదే  |   బ‌ట్ట‌లు లేకుండా అమ్మాయిలు వీడియో కాల్ చేస్తారు టెంప్ట్ అయితే మీ ప‌ని ఖ‌తం  |   హలీమ్ తింటే బరువు పెరుగుతారా?  |   ఆ నాలుగు ప్రాంతాల్లోనే కుంభమేళా ఎందుకు? కోట్ల ఖర్చుతో ఎందుకు నిర్వహిస్తారు?  |  

బ్రేకింగ్: కరోనా కారణంగా తెలంగాణలో విద్యా సంస్థల బంద్!

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 24వ తేదీ నుంచి విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా ప్రకటించింది. అసెంబ్లీ వేదికగా రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. పాఠశాలలు తెరుచుకోవడంతో విద్యార్థులు కరోనా బారిన పడుతుండటంతో తలిదండ్రులు నుంచి ఆందోళన వ్యక్తమవుతోందని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లమన్నారు.

అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలిపారు. కరోనాను అరికట్టడంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలన్నిటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్టుగా మంత్రి ప్రకటించారు. అయితే ఈ ఆదేశాల నుంచి వైద్య కళాశాలలకు మినహాయింపును ఇచ్చారు. వైద్య కళాశాలలలు మినహా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్టళ్లు, గురుకుల, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడనున్నాయి. విద్యార్థులకు గతంలో మాదిరిగానే ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలు జారీ చేసారు.

తెలంగాణలో ఫిబ్రవరి ఒకటి నుంచి 9 ఆ పై తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభం కాగా ఫిబ్రవరి 24 నుంచి 6,7,8 తరగతుల వారికి కూడా క్లాసులు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి నెల ఆరంభం నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో విద్యా సంస్థలను మూసివేశారు. మరికొన్ని చోట్ల సంపూర్ణ లాక్ డౌన్ ను అమలులో ఉంది.

 

 

 

Related News