logo

  BREAKING NEWS

బీజేపీ పార్టీలోకి తెలంగాణ ఫైర్ బ్రాండ్?… క్లారిటీ వచ్చేసింది!  |   మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!  |   8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |  

భగ్గుమంటున్న వంటనూనె ధరలు.. కారణం ఇదే!

పెరుగుతున్న వంటనూనె ధరలు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 20 శాతం నుంచి 30 శాతం మేర ధరలు పెరిగాయి. ఈ పరిస్థితులు సామాన్యులపై ప్రతికూల ప్రభావం చూపకముందే ధరలను నియంత్రించే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది.

మొన్నటి వరకు ఉల్లిపాయ, టమాటాలు, ఆలు ధరలు ఆకాశాన్నంటినట్టే ఇప్పుడు వంటనూనె ధరలు భగ్గుమంటున్నాయి. ఇంతకీ ఈ ఆకస్మిక ధరల పెరుగుదల వెనుక కారణం ఏమిటి అంటే.. లాక్ డౌన్ కారణంగా మలేసియా వంటి దేశాల్లో పామ్ ఆయిల్ తయారీ తగ్గింది అదే సమయంలో దేశంలో ఈ దిగుమతులు పెరిగాయి.

దీంతో అవసరానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. కన్స్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ప్రైస్ మానిటరింగ్ డేటా ప్రకారం.. గతేడాది లీటరు మస్టర్డ్ ఆయిల్ ధర రూ. 100 రూపాయలు ఉండగా ఇప్పుడు రూ. 120 కి చేరింది. రూ.75.25 గా ఉన్న వెజిటేబుల్ ఆయిల్ ధర రూ.102కు పెరిగింది. సన్‌ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ ధరల్లోను దాదాపు 25 శాతం నుండి 30 శాతం పెరుగుదల కనిపించింది.

Related News