logo

  BREAKING NEWS

కరోనా వ్యాప్తి: కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం!  |   హైదరాబాద్ పరిధిలో ఈ పది డివిజన్లే ‘కరోనా’ డేంజర్ జోన్లు!  |   బ్రేకింగ్: సచివాలయం కూల్చివేత పై ప్రభుత్వానికి హైకోర్టు షాక్!  |   బ్రేకింగ్: కంటైన్మెంట్ జోన్ గా తిరుమల  |   గాంధీ కుటంబానికి ఊహించని షాకిచ్చిన కేంద్రం..!  |   ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |  

చికెన్ ఎక్కువగా తినేస్తున్నారా?.. అయితే జాగ్రత్త!

చికెన్ పేరు చెబితేనే మాంసాహారులకు నోరూరుతుంది. కొంత మందికైతే రోజూ చికెన్ లేనిదే ముద్ద దిగదు. కరోనా వైరస్ నేపథ్యంలో చికెన్ తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచించిన విషయం తెలిసిందే. చికెన్ తీసుకోవడం ద్వారా ఇతర ఆహార పదార్థాల కన్నా అధిక మొత్తంలో శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది. దీంతో లాక్ డౌన్ లో చికెన్ అమ్మకాలు జోరందుకున్నాయి. అది నిజమే కానీ చికెన్ రోజూ తీసుకుంటే చిక్కుల్లో పడ్డట్టే అంటున్నారు వైద్య నిపుణులు.

ప్రతి రోజూ చికెన్ తినే అలవాటు ఉన్న వారు కేవలం 170 గ్రాములకు మించకుండా జాగ్రత్త పడాలంటున్నారు. అది కూడా కేవలం నాటు కోడి చికెన్ మాత్రమే మేలంటున్నారు. ఎందుకంటే సూపర్ మార్కెట్లలో అమ్మే చికెన్ లో హానికారక క్యాంపిలోబ్యాక్టర్, సాల్మొనెల్లా, ఇకోలి అనే బ్యాక్తీరియా ఉన్నట్టు ఓ అధ్యయనంలో కనుగొన్నారు. పెద్ద షాపుల్లో నిల్వ విక్రయించే చికెన్ లో ఈ బ్యాక్టీరియా సగం వరకు ఉంటుందట. ఇది పూర్తిగా తొలగిపోవాలంటే చికెన్ ను గంట పాటు ఉడికించి తినాలని సూచిస్తున్నారు.

ఫ్రై చేసిన చికెన్ తో ఇది సాధ్యం కాదు. ఈ బ్యాక్తీరియా వల్ల ఫుడ్ పాయిజన్, డయేరియా వంటి వ్యాధులు రావడమే కాకుండా క్యాన్సర్ కు దారి తీస్తుందట. జబ్బుల బారిన పడిన కోళ్ళ చికిత్స కోసం రైతులు వాడే యాంటీ-బయోటిక్ మందుల వల్ల కూడా ఈ బ్యాక్టీరియా విపరీతంగా పెరిగిపోతోందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల చికెన్‌ను ఎక్కువగా తినేవారు కాస్త తగ్గించుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు.

Related News