మీ దగ్గర చలామణిలో లేని పాత రూపాయల నోట్లు ఉన్నాయా? అయితే మీరు లక్షాధికారులు అయినట్టే. సాధారణంగా కాలం చెల్లినవి, లోపలున్న నోట్లను ఎవరికో ఒకరికి అంటగట్టి వదిలించేసుకుంటారు. లేదంటే వాటిపై మక్కువ ఉన్నవారు పర్సులో పెట్టుకుని తిరుగుతుంటారు. కానీ ఈ నోట్లే మీకు అదనపు ఆదాయాన్ని తెచ్చిపెడతాయి అదెలాగో చూద్దాం..
ఇటీవల కాలంలో పాత కాయిన్లకు, నోట్లకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. వస్తువులు పాతబడిన కొద్దీ అవి యాంటిక్యూ క్యాటగిరీ కిందకు వస్తుంటాయి. వీటికి డిమాండ్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. వేలంలో వైష్ణోదేవి బొమ్మ ఉన్న పాత నాణేలకు ఏకంగా రూ. 10 లక్షల రేటు పలుకుతుంది. దాదాపు అయిదున్నర దశాబ్దాల క్రితం నాటి ఒక రూపాయి నోటు ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ సైటు ఈబేలో రూ. 11,000 పైచిలుకు పలుకుతోంది. అలాగే, అప్పుడెప్పుడో హైదరాబాద్ ప్రభుత్వం జారీ చేసిన రూపాయి నోటు దాదాపు రూ. 10 వేలు పలుకుతోంది. కొన్నాళ్ల క్రితం మరో రూపాయి నోటు ఏకంగా రూ.25,000కు అమ్ముడైంది.
ఇవన్నీ పాత నోట్లే అయినా వీటికంటూ ఒక ప్రత్యేకత ఉండటమే ఈ నోట్ల విలువకు రెక్కలు రావడానికి కారణం. 1943లోని రూ.10 నోటును ఆన్లైన్లో విక్రయించడం వల్ల రూ.25,000 వరకు పొందొచ్చు. ఈ నోటును బ్రిటీష్ రాజ్ విడుదల చేశారు. ఈ పాత రూ.10 కరెన్సీ నోటుపై సీడీ దేశ్‌ముఖ్ సంతకం ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం కూడా ఉంటుంది. ఇంగ్లీష్‌లో పది రూపాయలు అని రాసి ఉంటుంది.
నోట్ల ముద్రణలో లోపాలుంటే వాటిని ఆర్బీఐ బటయకు విడుదల చేయదు కానీ పొరపాటున కొన్ని బయటకు వచ్చేస్తుంటాయి. ఉదాహరణకు సిరీస్ నంబర్, అక్షరాలకు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో స్టార్ సింబల్ ను గుర్తుగా ముద్రిస్తారు. ఇలాంటి వాటిని నాణేలు సేకరించేవారు పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. 123456, 111111, 786786 లాంటి ఫ్యాన్సీ నంబర్లు ఉన్న నోట్లు కూడా చాలా అరుదుగా లభిస్తాయి.
కొంత మంది గవర్నర్ల సంతకంతో ఉన్న నోట్లకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మన దగ్గర ఉన్న కాయిన్లు, నోట్లను పరిశీలిస్తే ఆ డబ్బు గెలుచుకునే అదృష్టవంతులు మీరే కావచ్చు. ఇండియా మార్ట్, షాప్‌క్లూస్,మరుధర్ ఆర్ట్స్వం, ఈబే, క్వికర్ లాంటి సైట్ల ద్వారా మీ దగ్గరున్న పాత నోట్లను ఆన్ లైన్ లో ఉంచి సంపాదించుకోవచ్చు.