logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

దృశ్యం 2 రివ్యూ: కథను నమ్మి సినిమా తీస్తే ఇలా ఉంటుంది!

ఆరేళ్ళ క్రితం మలయాళ చిత్ర పరిశ్రమలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగుతో పాటుగా మరో నాలుగు భాషల్లో రీమేక్ చేసారు. అన్ని భాషల్లోనూ అంతే హిట్ గా నిలిచింది. మళ్ళీ ఇన్నేళ్లకు మలయాళంలో దృశ్యం సినిమాకు సీక్వెల్ తెరెకెక్కించారు. ఇటీవల దృశ్యం 2 ను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

దృశ్యం సినిమాలో తన కుటుంబం జోలికి వచ్చిన వరుణ్ ను జార్జి కుట్టి(మోహన్ లాల్) కూతురు హత్య చేస్తుంది. ఆ హత్యను నుంచి తన కుటుంబాన్ని తప్పించడానికి ఎవ్వరూ ఊహించని విధంగా పోలీస్ స్టేషన్లోనే వరుణ్ మృతదేహాన్ని పాతి పెడతాడు హీరో. ఇలా ఈ సినిమా కథ ముగుస్తుంది. కానీ కేసును నిరూపించలేకపోయిన అపరాధ భావంతో పోలీసులు రగిలిపోతారు. రహస్యంగా ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. ఈ కేసులో చివరకు ఒక క్లూను కనిపెడతారు. ఆ ఒక్క క్లూ సినిమా కథను మలుపు తిప్పుతుంది.

కేసు నుంచి బయటపడిన జార్జ్ కుటుంబం ప్రశాంతంగా గడుపుతుంటుంది. టీవీ కేబుల్ ఆపరేటర్ అయిన జార్జి తనకున్న సినిమాల పిచ్చి తో ఓ థియేటర్ ను ఓపెన్ చేస్తాడు. సినిమాలు కూడా నిర్మిస్తుంటాడు. ఈ నేపథ్యంలో హత్య కేసు నుంచి తెలివిగా బయటపడిన వ్యక్తికి ఆ కేసుకు సంబందించిన సమస్య మళ్ళీ వస్తే? ఈ కేసులో కీలక సాక్ష్యాలు పోలీసుల చేతిలో ఉన్నాయని తెలిస్తే? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాడు? చివరకు పోలీసుల నుంచి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడనే విషయం పై ఈ సినిమా సాగుతుంది.

సినీ పరిశ్రమలో ఒక సినిమాకు సీక్వెల్ అంటే ఏదో మొక్కుబడిగా తీస్తుంటారనే టాక్ నడుస్తుంది. కానీ దృశ్యం సినిమా ఆ అభిప్రాయాలను పటాపంచలు చేసింది. దృశ్యం సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా ఉందంటూ ఈ సినిమాపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమా మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిరేపుతుంది. జార్జిని ఈ కేసులో దోషిగా తేల్చేందుకు పోలీసులు చేసే ప్రయత్నాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఉహించని ట్విస్టులతో సినిమా సాగుతుంది. చివరకు సూపర్ అనిపించే క్లైమాక్స్ తో దృశ్యం 2 ను ముగించాడు డైరెక్టర్ కమ్ రచయిత జీతూ జోసెఫ్. దృశ్యం సీక్వెల్ ఇప్పటివరకు సినీ పరిశ్రమలో వచ్చిన సినిమాల్లోనే బెస్ట్ సినిమా గా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సినిమాలో నటీనటుల విషయానికొస్తే.. జార్జి పాత్రలో మోహన్ లాల్ జీవించారనే చెప్పాలి. సినిమా చూసిన ప్రేక్షకుడికి ఆ పాత్రపై ఒక ఆరాధనా భావాన్ని కలిగేలా చేసారు. పోలీస్ అధికారిగా నటించిన మురళి గోపి నటన ఏమాత్రం అసహజంగా అనిపించదు. తెరపై నిజమైన పోలీసులను చూసిన అనుభూతిని కలిగించారు. మిగిలిన పాత్రలైన మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా, ఆశా శరత్ కూడా తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు. రెండున్నర గంటల నిడివిగల ఈ సినిమా లో ఒకే ఒక పాట ఉంటుంది. అనిల్ జాన్సన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది. మొత్తానికి ఈ సినిమా దృశ్యం కన్నా త్రిల్ ను కలిగించిందనే చెప్పాలి.

 

Related News