logo

  BREAKING NEWS

డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో టాలీవుడ్ ప్రముఖులు

హైదరాబాద్ లో వెలుగు చుసిన డ్రగ్స్ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. డ్రగ్స్ అమ్ముతూ బయటపడ్డ పరం, అమిత్ లను విచారించగా ఈ కేసులో మొత్తం 300 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా తేల్చారు. లాక్ డౌన్ నిబంధనలను సడలించడంతో ఇటీవల కొందరు బెంగుళూరు వేలి వీరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం.

ఇక పోలీసుల దర్యాప్తులో డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిలో బడా వ్యాపారస్తుల పిల్లలు, టాలీవుడ్ సినీ నటులు, విద్యార్థులు ఉన్నట్టుగా తేల్చారు. ప్రస్తుతం వీరందరిపై నిఘా ఉంచారు. నిందితులు వాట్సాప్ చాటింగ్ తో పాటుగా కాల్ డేటాను కూడా డిలీట్ చేయడంతో వాటిని రిట్రీవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఎక్సయిజ్ అధికారులు. ఈ డేటా ఆధారంగా ఆ 300 మంది పూర్తి వివరాలు బయటకు వస్తాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

జూన్ 2వ తేదీన ఫేసు మాస్కుల పేరుతో రెండు రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్టుగా గురించారు. హైదరాబాద్, బెంగళూరు కేంద్రంగా ఈ దందా జరుగుతుందని తెలుసుకుని ఈ కేసులో కీలక ఆధారాల కోసం ప్రయత్నిస్తున్నారు.

Related News