logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

మందుబాబులకు షాకిచ్చిన వాతావరణ శాఖ… కీలక హెచ్చరికలు జారీ!

మందుబాబులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. చాలా మంది చలి కాలంలో మందు తాగితే శరీరంలో వేడి పుట్టి వెచ్చగా ఉంటుందని భావిస్తుంటారు. కానీ అదంతా వట్టి భ్రమేనట. చలికాలంలో మద్యం సేవిస్తే ప్రాణాలకే ముప్పు అని వారు పేర్కొంటున్నారు.

కొత్త సంవత్సరం రానుంది. అందులోనూ చలి తీవ్రంగా ఉంది. దీంతో మందు బాబులు అతిగా మద్యం తీసుకుంటారు. అయితే చలి కాలంలో ఇలా అతిగా మద్యం తాగితే శరీర ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయి అది వివిధ అనారోగ్యాలకు దారి తీస్తుందని అంటున్నారు. ఉత్తర భారతం నుంచి ప్రమాదకరమైన అతి శీతల గాలుల వల్ల ఈ ఏడాది చలి బాగా పెరిగింది.

డిసెంబర్ 28 నుంచి ఈ గాలులు మరింత తీవ్ర రూపం దాల్చనున్నాయని అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి సమయంలో వేడుక ఏదైనా మద్యం జోలికి వెళ్లరాదనీ వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రజలు కొత్త సంవత్సరం నేపథ్యంలో ఈ చలి గాలులకు బయట తిరగవద్దని సూచించింది.

Related News