logo

  BREAKING NEWS

మీనా భ‌ర్త మృతికి అస‌లు కార‌ణం ఇదే  |   మీ సిబిల్ స్కోర్ ఈజీగా పెంచుకోండి ఇలా  |   అంబాసిడ‌ర్ మ‌ళ్లీ వ‌స్తోంది.. కొత్త లుక్ సూప‌ర్‌  |   తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌పై వివాదం.. డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ట్వీట్‌  |   వామ్మో.. ఓలా బైక్ ఎలా విరిగిపోయిందో చూడండి  |   ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అందుకే నా మీద కోపం.. షాకింగ్ విష‌యం చెప్పిన‌ రాజ‌శేఖ‌ర్‌  |   ఆంటీతో యువ‌కుడి వివాహేత‌ర సంబంధం.. చివ‌ర‌కు విషాదాంతం  |   కేంద్రం బాట‌లో రాష్ట్రాలు.. భారీగా త‌గ్గుతున్న పెట్రోల్ ధ‌ర‌లు  |   దావోస్‌కు వెళ్లిన టీడీపీ ఎంపీ.. కేంద్ర‌మంత్రితో ఫోటో  |   రేవంత్ రెడ్డిని డిస్‌మిస్ చేయండి.. రాహుల్ గాంధీకి బండ్ల గ‌ణేష్ ఫిర్యాదు  |  

ఎల‌క్ట్రిక్ బండ్ల ప్ర‌మాదాల‌కు కార‌ణాలివే..! డీఆర్‌డీవో సంచ‌ల‌న నివేదిక‌

దేశంలో ఒక‌వైపు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వాడ‌కాన్ని పెంచాల‌ని కేంద్ర ప్రభుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంటే మ‌రోవైపు ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు త‌ర‌చూ ప్ర‌మాదాలకు గుర‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. నిత్యం ఎక్క‌డో ఒక చోట ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు ద‌గ్ధ‌మ‌య్యాయ‌నే వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఈ ప్ర‌మాదాల్లో ప‌లువురు మ‌ర‌ణిస్తున్నారు. ఈ వ‌రుస ప్ర‌మాదాల నేప‌థ్యంలో కేంద్రం అప్ర‌మ‌త్త‌మైంది.

ఎందుకు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయో తేల్చాల‌ని డీఆర్‌డీవోను ఆదేశించింది. ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ప్ర‌మాదాల‌పై స‌మ‌గ్రంగా విచారించిన డీఆర్‌డీవో ఒక కీల‌క నివేదిక‌ను రూపొందించింది. అంద‌రూ అనుకుంటున్న‌ట్లుగా ఎండ‌ల‌కు వాహ‌నాల ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం లేద‌ని, ఇందుకు వేరే కార‌ణాలు ఉన్నాయ‌ని ఈ నివేదిక‌లో స్ప‌ష్టం చేసింది.

వాహ‌నాల త‌యారీ ఖ‌ర్చు త‌గ్గించ‌డానికి త‌క్కువ నాణ్య‌త క‌లిగిన మెటీరియ‌ల్‌ను ఉప‌యోగించ‌డం, బ్యాట‌రీ ప్యాక్స్ డిజైన్ల‌లో లోపాలు ఉండ‌టం, స‌రైన ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌కుండానే వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేయ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రుగుతున్నాయ‌ని ఈ నివేదిక‌లో డీఆర్‌డీవో పేర్కొంది. మరి, ఈ నివేదిక‌పైన కేంద్ర ప్ర‌భుత్వం ఎలా స్పందిస్తుంద‌నేది చూడాల్సి ఉంది.

Related News
%d bloggers like this: