logo

  BREAKING NEWS

ఓటీటీలో రిలీజైన కేజీఎఫ్: చాప్ట‌ర్‌-2..! కానీ షాకిచ్చిన అమెజాన్ ప్రైమ్‌  |   టాయిలెట్‌లో కెమెరా.. హోంమంత్రికి ఫిర్యాదు  |   కాబోయే భ‌ర్త మృతి.. ఆ యువ‌తి చేసిన ప‌నికి క‌న్నీళ్లు ఆగ‌వు  |   స‌లార్ సినిమాపై కిక్కిచ్చే వార్త‌  |   మ‌హేష్ – రాజ‌మౌళి సినిమాపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజ‌యేంద్ర ప్ర‌సాద్‌  |   వంద‌ల ఎక‌రాల భూమి ఉన్న కుటుంబంలో కేసీఆర్ పుట్టారు  |   2022 – 23కు కేంద్రీయ విద్యాల‌య అడ్మిష‌న్లు ప్రారంభం.. పూర్తి వివ‌రాలు  |   నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు  |   మ‌రో కొత్త ప‌థ‌కాన్ని ప్రారంభించ‌నున్న జ‌గ‌న్‌.. దేశంలోనే మొద‌టిసారి  |   అండ‌మాన్ ఎన్నిక‌ల్లో మ‌రోసారి స‌త్తా చాటేందుకు చంద్ర‌బాబు స్కెచ్‌  |  

మాస్కును ఇలా ధరిస్తే కరోనా నుంచి తప్పించుకున్నట్టే!

కరోనా కోరలు చేస్తున్న సమయంలో భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కరోనా నుంచి తమను తాము కాపాడుకోవడానికి మాస్కుల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కొందరు ఎన్ 95 మాస్కులు ధరిస్తే మరికొందరు లేయర్డ్ మాస్కును, సర్జికల్, క్లాత్ మాస్కులను ధరిస్తున్నారు. కొందరైతే రెండు జతల మాస్కులను ధరించి కనిపిస్తున్నారు. అయితే తాజా పరిశోధన ఒకటి మాస్కు ధరించడంపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

రెండు మాస్కులను ధరించడం వల్ల కరోనా నుంచి రెండింతల రక్షణ లభిస్తుందని తేలింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ నార్తు కరోలినా పరిశోధనలో ఈ విషయాన్ని కనుగొన్నారు. ముఖాన్ని బిగుతుగా పట్టి ఉంచే రెండు టైట్ ఫిట్ మాస్కులను ధరించడం వల్ల సార్స్‌–కోవ్‌–2 సైజు వైరస్ ను సమర్థవంతంగా అడ్డుకోగలవని, వైరస్ ను నోరు, గొంతు ముక్కులోకి వెళ్లకుండా ఆపగలదని వెల్లడైంది.

మాస్కుల్లో ఎక్కువ పొరలు ఉండటం వల్ల వాటి మధ్యన ఖాళీ స్థలం తగ్గిపోతుంది. అప్పుడు వైరస్ ఈ పొరలను దాటుకుని మన శరీరంలోకి ప్రవేశించడం కష్టమవుతుంది. కాబట్టి రెండు మాస్కులను ధరించడం వల్ల కరోనా వైరస్ నుంచి మరింత రక్షణ లభించడం ఖాయమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సాధారణంగా క్లాత్ మాస్కు వల్ల 40 శాతం వైరస్ నుంచి రక్షణ లభిస్తే సర్జికల్ మాస్కు ద్వారా 60 శాతం రక్షణ లభిస్తుంది. మొదట కసర్జికల్ మాస్కును ధరించి దాని పై నుంచి క్లాత్ మాస్కును ధరిస్తే మరో 20 శాతం రక్షణ పెరుగుతుందని అంటున్నారు.

Related News