logo

  BREAKING NEWS

మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |   తెలుగు సినీ పరిశ్రమను కాపాడుకుందాం: కేసీఆర్  |   హైద్రాబాదులో గుంతలు లేని రోడ్డు చూపిస్తే రూ. లక్ష..!  |   భాగ్యనగరవాసులకు అలెర్ట్: ముంచుకొస్తున్న భారీ ముప్పు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన..!  |   శత్రుదేశాలకు నిద్రలేకుండా చేసే చైనా రహస్యం.. ‘ఐదు వేళ్ళ వ్యూహం’ గురించి తెలుసా?  |   హైదరాబాద్ పాత బస్తీలో హైటెన్షన్.. భారీగా పోలీసుల బందోబస్తు!  |   జీహెచ్ఎంసీ ఎన్నికలు: టీఆర్ఎస్ రెండో జాబితా విడుదల!  |  

హైదరాబాద్ లో మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు…?

నాలుగు దశాబ్దాల కిందట హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేసేవి. హైదెరాబాద్ లో ఈ బస్సులు ప్రత్యేకంగా కనిపించేవి. పర్యాటకులు, ప్రయాణికులు డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించడానికి ఎంతో ఆసక్తి చూపేవారు. అప్పట్లో హైదరాబాద్ అనగానే చార్మినార్, బిర్లా మందిర్ వంటి కట్టడాలతో పాటుగా డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొచ్చేవి.

కానీ పదేళ్ల క్రితం నుంచి ఈ బస్సులను ఆర్టీసీ నిలిపివేసింది. అయితే ఇప్పుడు వీటి ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా? సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ఇదే విషయాన్నీ ఓ ఫొటోతో పోస్ట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ను ప్రశ్నించారు. ఆ పోస్ట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. అంతేకాదు ఆయన చిన్ననాటి మధుర స్మృతుల్లోకి వెళ్లారు.

తనకు డబుల్ డెక్కర్ బస్సులతో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయన్నారు. తాను అబిడ్స్ లోని సెయింట్ జార్జ్ స్కూల్ లో చదువుకునే రోజుల్లో ఈ బస్సుల్లో ప్రయాణించేవాడినని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ బస్సులను ఎందుకు నిలిపివేసారో తనకు తెలియదన్నారు. ఈ బస్సులను తిరిగి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయా అంటూ రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కోరారు. ఈ నేపథ్యంలో మళ్ళీ హైదరాబాద్ లో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించనున్నారా అనే చర్చ నడుస్తుంది.

Related News